గుంటూరు

వైభవంగా వెంకన్న కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, మే 30: శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఘాట్‌రోడ్డు మార్గంలో గల పద్మావతీ సమేత వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. సోమవారం ఉదయం గరుడోత్సవం, రాత్రి రాజాధిరాజ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం జరిపారు. ఆలయ ధర్మకర్తలు కోసూరు శివనాగరాజు, ఎవి సాంబశివరావు, రావుల శ్రీనివాస్, ఆలేటి నాగలక్ష్మి, మోరంపూడి నాగేశ్వరరావు, వెనిగళ్ల ఉమాకాంతం, ఊట్ల శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈఓ మండెపూడి పానకాలరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు.