గుంటూరు

పానుగంటి వారి అద్వితీయ సాహితీ సృష్టి ‘వైష్ణవ సాక్షి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), మే 30: తెలుగు సాహిత్య చరిత్రలో నవీన అధ్యాయానికి నాంది పలికి, తన వచన, రచనా పటిమతో ఎన్నో పుస్తకాలను, వ్యాసాలను రచించి పాఠక లోకాన్ని సుదీర్ఘకాలం పాటు ఆత్మీయంగా ఆకట్టుకుని, గిలిగింతలు పెట్టిన వైష్ణవ సాక్షి పానుగంటి వారి అద్వితీయ సాహితీ సృష్టి అని పలువురు సాహితీవేత్తలు ప్రశంసల జల్లులు కురిపించారు. సోమవారం రాత్రి నగరంలోని బృందావన గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం అన్నమయ్య కళావేదికపై జగమెరిగిన సాహితీవేత్త పానుగంటి లక్ష్మీ నరసింహారావు రచించిన సాక్షి వ్యాసాల్లోని శ్రీ వైష్ణవ సంబంధ వ్యాస సంకలనమైన వైష్ణవ సాక్షి పుస్తకావిష్కరణ సభ జరిగింది. సభకు భారతీయ మార్గం మాసపత్రిక సంపాదకుడు డాక్టర్ పులిచర్ల సాంబశివరావు అధ్యక్షత వహించారు. పుస్తకాన్ని సంస్కృతి సంస్థ వ్యవస్థాపకుడు సర్రాజు బాలచందర్ ఆవిష్కరించి పుస్తకాన్ని సంకలనం చేయడంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్న మోదుగుల రవికృష్ణను అభినందించారు. ప్రధానవక్త ధర్మపురి నారసింహ సంస్కృతాంధ్ర కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు డాక్టర్ సంగనభట్ల నరసయ్య సంకలన కర్త ప్రయత్నాన్ని కొనియాడారు. అధ్యక్షపన్యాసం చేసిన సాహితీవేత్త సాంబశివరావు మాట్లాడుతూ తెలుగువారి సాహితీ సంపద సాక్షి వ్యాసాలన్నారు. ఆర్‌విఆర్ విద్యా కళాశాల అధ్యాపకుడు రవికృష్ణ, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కెజి శంకర్ దంపతులు, సాహితీవేత్తలు, భాషా ప్రియులు పాల్గొన్నారు.