గుంటూరు

పేద ప్రజలఆర్థిక అభ్యున్నతే ధ్యేయంగా పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, ఏప్రిల్ 3: పేద ప్రజల ఆర్థిక అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమ పథకాలు తీసుకువచ్చి అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ అన్నారు. ఆదివారం మాదిపాడు గ్రామ పంచాయతీ పరిధిలో గల పులిచింతల ప్రాజెక్టు వద్ద మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 25 లక్షల చేప పిల్లలను నదిలోకి వదిలిపెట్టారు. ఈ సందర్భంగా కొమ్మాలపాటి శ్రీ్ధర్ మాట్లాడుతూ గ్రామాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వౌలిక వసతుల రూపకల్పనకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధంచేసి అమలుకు సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాబోయే రెండు సంవత్సరాల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు అంతర్గత రోడ్లు, తాగునీటి సమస్యలను మెరుగుపర్చేందుకు కృషి చేస్తామన్నారు. శాసనసభలో ప్రతిపక్ష నేత జగన్ ప్రజా సమస్యలను గాలికొదిలేసి స్వప్రయోజనాల కోసమే తాపత్రయపడ్డారని ఆరోపించారు. సభా సమయాన్ని దుర్వినియోగం చేశారని జగన్‌ను విమర్శించారు. అనంతరం మాదిపాడులో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 30 తాగునీటి బోర్లు వేయించి 40 లక్షల విలువైన విద్యుత్ మోటార్లు అందించారు. అలాగే 12 లక్షల రూపాయల అంచనా వ్యయంతో మాదిపాడు, కంచుబోడుతండా, జడపల్లితండాలలో అంతర్గత రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. 35 మంది జాలర్లకు వలలను అందించారు. కార్యక్రమంలో ఎంపిపి ఆర్ పిచ్చమ్మ, ఎఎంసి చైర్మన్ వై నాగేశ్వరరావు, జెడ్పీటీసీ వెంకటేశ్వరరావు, పివి రామారావు, బి శ్రీను, ఆర్ విశే్వశ్వరరావు, పి రత్నం, ఎండిఒ డిజి నాయక్, బాలు నాయక్, జాన్‌సైదా తదితరులున్నారు.