గుంటూరు

కఠోర నియమ నిష్టలతో రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), జూన్ 7: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ముస్లింలు, వారి కుటుంబాలు అత్యంత పవిత్రంగా భావించే ఖురాన్ గ్రంథం అవతరించిన పుణ్యమాసం రంజాన్ సోమవారం సాయంత్రం నెలవంక దర్శనంతో ప్రారంభం కాగా మంగళవారం నుంచి ఉపవాస దీక్షలను నగరంలో కఠోర నియమనిష్టలతో ముస్లింలు ప్రారంభించారు. తెల్లవారుజామున ఉపవాస దీక్ష ప్రారంభానికి ముందే సహారీని స్వీకరించి అనంతరం రోజంతా ఉపవాస దీక్షలను కొనసాగించారు. సాయంత్రం ఉపవాసం అయిన తరువాత ఖర్జూర ఫలాలను దైవ ప్రసాదంగా స్వీకరించి అనంతరం ఇఫ్తార్‌ను విందుగా అందుకున్నారు. ఈ సందర్భంగా నగరంలోని మాయాబజార్, పాత గుంటూరు, ఆంధ్రా ముస్లిం కళాశాల, పొన్నూరు రోడ్డు, కోబాల్డ్‌పేట, రైలుపేట, ఆనందపేట తదితర ప్రాంతాలతో పాటు గుంటూరులోని 70కు పైగా ఉన్న మసీదుల, పరిసర గ్రామాల్లోని మసీదుల్లో రంజాన్ మాస తొలి ప్రారంభ ప్రార్థనలు జరిగాయి.