గుంటూరు

రాజధాని గ్రామాల్లో రిజిస్ట్రేషన్లకు ఎన్‌ఓసి మెలిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూన్ 9: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగర పరిధిలోని 29 గ్రామాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లను గురువారం మధ్యాహ్నం నుంచి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిలిపివేశారు. ఆయా గ్రామాల్లో స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ చేయాలంటే సిఆర్‌డిఎ అధికారుల నుంచి నో అబ్జక్షన్ సర్ట్ఫికెట్ (ఎన్‌ఓసి) తెచ్చుకుంటేనే చేస్తామని మంగళగిరి సబ్‌రిజిస్ట్రార్ బి నాగేశ్వరరావు వెల్లడించారు. మధ్యాహ్నం వరకు మామూలుగానే రిజిస్ట్రేషన్లు చేశామని, జిల్లా రిజిస్ట్రార్ల నుంచి అందిన సమాచారం మేరకు రాజధాని గ్రామాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లను నిలిపి వేశామని, ఎన్‌ఓసి తెచ్చుకుంటే రిజిస్ట్రేషన్ చేస్తామని ఆయన తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ నుంచి ఎన్‌ఓసి ఉన్న వాటికే రిజిస్ట్రేషన్లు చేయాలని ఫోనుద్వారా జిల్లా రిజిస్ట్రారుకు అందిన సమాచారాన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపినట్లు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ల నిలుపుదల వ్యవసాయ భూములకేనా లేక ఇళ్లస్థలాలకు, ఇళ్లకు కూడానా అనే విషయం స్పష్టతలేదని, ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నామని, ప్రస్తుతానికైతే అన్ని రకాల రిజిస్ట్రేషన్లు నిలిపి వేశామని సబ్ రిజిస్ట్రార్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. కాగా ఆకస్మికంగా రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేయడాన్ని భూమిని అమ్మినవారు, కొన్నవారు కూడా తీవ్రంగా నిరసించారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద రిజిస్ట్రేషన్ కోసం ఇప్పటికే చలానా కట్టుకున్న వారు కూడా ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహావేశాలు వెళ్లగక్కారు. సిఆర్‌డిఎ అధికారుల నుంచి ఎన్‌ఓసి తెస్తేనే రిజిస్ట్రేషన్లు చేస్తామనటం ప్రభుత్వానికి తగదని, పునఃపరిశీలించాలని పలువురు కోరారు.