గుంటూరు

పడిగాపులు గాసినా దొరకని చినబాబు దర్శనభాగ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 9: దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం తమకు ఉందని చెప్తున్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలకు వారి సంక్షేమం పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉందనేది తేటతెల్లమైంది. గురువారం మధ్యాహ్నం రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వచ్చారు. పార్టీ సంఘాల నాయకులతో పాటు రాష్ట్ర కార్యాలయ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఆయన్ను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు ఆరుబయట గంటలకొద్దీ పడిగాపులు గాసినా చినబాబు దర్శనభాగ్యం కలగలేదు. కార్యాలయ ఆవరణలో కూర్చునేందుకు ఏర్పాటుచేసిన బల్లలను సైతం తొలగించి ఎవరినీ అనుమతించవద్దని లోకేష్ ఆదేశించడంతో కార్యకర్తలు నిలువుజీతం చెల్లించాల్సి వచ్చింది. కనీసం తాగేందుకు మంచినీరు, ఇతర వసతులు కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో లేకపోవడంతో కేడర్‌లో అసహనం చోటు చేసుకుంది. లోకేష్ పార్టీ కార్యాలయంలో ఉన్నారన్న సమాచారమందుకున్న నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ఎమ్మెల్యేలను సైతం లోనికి అనుమతించక పోవడంతో విసుగెత్తి కొద్దిసేపటికి నిష్క్రమించారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కార్యాలయ పనులను పరిశీలించిన లోకేష్ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర స్థాయి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రాత్రి 9 గంటలకైనా లోకేష్‌తో మాట్లాడే అవకాశం ఉంటుందని నిరీక్షించిన మీడియా ప్రతినిధులు సైతం వెనుదిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.