గుంటూరు

కన్నబిడ్డలను కాలరాసిన తల్లికి యావజ్జీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (లీగల్), జూన్ 10: పుట్టు మూగ, చెముడుతో జన్మించిన పిల్లలను పోషించలేక వారిని కడతేర్చి తాను కూడా ఆత్మహత్యకు యత్నించిన తల్లికి యావజ్జీవ కారాగారశిక్ష, జరిమానా విధిస్తూ గుంటూరు ఫ్యామిలీకోర్టు న్యాయమూర్తి బి మంజరి శుక్రవారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... విశాఖపట్నం సమీపంలోని యలమంచలికి చెందిన గుడుపు చంద్రారావు తన మేనకోడలు సంధ్యాలక్ష్మిని సంఘటనకు పధ్నాలుగు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. మేనరికం కావడంతో వీరికి జన్మించిన జోగి ప్రియాంక (5), దుర్గాకుమార్ (9) లిద్దరూ పుట్టుకతోనే మూగ, చెముడుతో పాటు మానసికంగా ఎదగలేకపోయారు. వీరికి పలు వైద్య చికిత్సలు చేయించినప్పటికీ ఏమాత్రం మార్పురాలేదు. దీంతో విసుగుచెందిన సంధ్యాలక్ష్మి గత ఏడాది జనవరి 23వ తేదీన సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆ పిల్లలకు ఎలుకల మందు ఇచ్చి తను కూడా ఆ మందును తీసుకుంది. బయట నుంచి వచ్చిన భర్త ఈ సంఘటనను చూసి భార్యాపిల్లలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే పిల్లలు ప్రియాంక, దుర్గాకుమార్ మృతిచెందారు. సంధ్యాలక్ష్మికి సకాలంలో వైద్యం అందడంతో ఆమె కోలుకుంది. కొత్తపేట సిఐ వెంకన్నచౌదరి నిందితురాలిని అరెస్ట్‌చేసి చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు లభించలేదు. అయితే వైద్యపరమైన సాక్ష్యం ఉందంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీగల దుర్గాప్రసాద్ వాదించారు. కన్నతల్లి పిల్లల పట్ల కాఠిన్యం వహించలేదని, పిల్లల పరిస్థితిని చూసి తాను కూడా చనిపోవాలనుకుందని, అయినప్పటికీ చేసింది నేరమే కాబట్టి ఆమెకు యావజ్జీవ కారాగారశిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి మంజరి తీర్పుచెప్పారు.