గుంటూరు

నూతన రాష్ట్రంలో ఫోరం ఏర్పాటుకు సన్నాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (లీగల్), జూన్ 10: రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర వినియోగదారుల ఫోరాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు త్వరితగతిన ఏర్పాట్లు జరుగుతున్నాయని, అయితే వౌలిక సదుపాయాలు ఏ ప్రాంతంలో ఉన్నాయో పరిశీలిస్తున్నామని ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జస్టిస్ నౌషద్ అలీ వెల్లడించారు. శుక్రవారం జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆయన తనిఖీచేసి సంతృప్తి వ్యక్తంచేశారు. అనంతరం గుంటూరు బార్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు బార్‌లో సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశానికి బార్ అధ్యక్షుడు గుత్తా వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. జస్టిస్ నౌషద్ అలీ మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో పలు లోపాలు ఉన్నాయని, ఈనేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లోని న్యాయవాదులు మానసికంగా విడిపోయారని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సమస్య పరిష్కారానికి ఎవరి ప్రాంతంలో వారు హైకోర్టు, అనుబంధ సంస్థలు ఏర్పాటు చేసుకోవడమే ప్రత్యామ్నాయ మార్గమన్నారు. గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో వౌలిక వసతుల పరిశీలన జరుగుతుందని, సౌకర్యాలు అధికంగా ఉన్నచోట రాష్ట్ర ఫోరాన్ని ఏర్పాటు చేస్తామని జస్టిస్ నౌషద్ అలీ వివరించారు. గుత్తా మాట్లాడుతూ గుంటూరు జిల్లా కోర్టు ఆవరణ రాష్ట్రంలోనే అతి విశాలమైన ప్రాంగణాన్ని కల్గి ఉందన్నారు. ఇందు లో రాష్ట్ర హైకోర్టుకు, అనుబంధ న్యా యస్థానాల ఏర్పాటుకు కూడా అవకా శం ఉందని, ఈ నేపథ్యంలో రాష్టఫ్రోరాన్ని గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటుచేసేందుకు మొగ్గుచూపాలంటూ జస్టిస్ నౌషద్ అలీకి విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, గుంటూరు జిల్లా ప్రధాన పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీగల దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.