గుంటూరు

కాపుమిత్ర చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూన్ 10: జగన్‌కు మేలు చేసే విధంగా వ్యవహరిస్తున్న కాపు సామాజిక వర్గీయులను సహించ వద్దని, న్యాయపరంగా ఎటువంటి చిక్కులు లేకుండా కాపులను బీసీల్లో చేర్చేందుకే జస్టిస్ మంజునాథ కమిషన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏర్పాటు చేశారని, కాపు సామాజిక వర్గానికి మేలుచేసే మంచిపనిని ఓర్వలేక పక్కదారి పట్టించే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కె కళావెంకట్రావు అన్నారు. మండల పరిధిలోని ఆత్మకూరులో గల హ్యాపీ రిసార్ట్స్ ప్రాంగణంలో శుక్రవారం అఖిల భారత కాపుసమాఖ్య ఆధ్వర్యాన నిర్వహించిన రాష్ట్ర కాపుసంఘాల సమాఖ్య ఆత్మీయ సదస్సులో కళావెంకట్రావు ప్రసంగించారు. చంద్రబాబును కాపుమిత్రగా సదస్సు తీర్మానించింది. నరహరిశెట్టి శ్రీహరి అధ్యక్షత వహించారు. కళావెంకట్రావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ స్వాతంత్య్రం వచ్చాక కాపులు బీసీ రిజర్వేషన్ జాబితాలోనే ఉండేవారని, ఒక ముఖ్యమంత్రి జాబితానుంచి తొలగించగా సంజీవయ్య చేర్చారని, మళ్లీ మరో ముఖ్యమంత్రి తొలగించారని, ఇదంతా కాంగ్రెస్ రాజకీయాల్లోనే జరిగిందని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కాపులను వాడుకుని ఎటువంటి మేలు చేయలేదని, ఆయన హయాంలో రాయలసీమ జిల్లాల్లో 54 అసెంబ్లీ సీట్లుంటే కేవలం ఒక స్థానానే్న కాపులకు కేటాయించారని, దీన్నిబట్టి ఈ సామాజికవర్గం పట్ల ఆయనకున్న ప్రేమ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చని కళా వెంకట్రావు అన్నారు. ప్రస్తుత అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలుండగా 25 మంది కాపులు ఉన్నారని, వీరిలో 24 మంది టిడిపిలోనే ఉన్నారని ఆయన అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షనేత జగన్ పక్కసీట్లో జ్యోతుల నెహ్రూ కూర్చుంటే ఓర్వలేని జగన్ వేరేచోటికి వెళ్లి కూర్చోమన్నారని కళా వెంకట్రావు అన్నారు. చంద్రబాబుది కాపులకు మేలుచేసే ఆలోచనేనని, ముద్రగడ వ్యవహార శైలి తీవ్ర ఆక్షేపణీయంగా ఉందని, వైసీపీనేత కరుణాకరరెడ్డి తాను ముద్రగడను కలిసిన మాట వాస్తవమేనంటూ ఒప్పుకున్న విషయం గమనించాలని, ఇది కాపు సామాజిక వర్గానికి ఉపయోగపడేదేనా ఆలోచించాలన్నారు. ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు కాపులు ముందుకు సాగాలని, జస్టిస్ మంజునాథ కమిషన్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కాపుల ఆర్థిక పరిస్థితి వివరిస్తూ వినతులు ఇవ్వాలని వెంకట్రావు కోరారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ, చందు సాంబశివుడు, తాడి శకుంతల, ఇక్కుర్తి సాంబశివరావు, ఎర్రగోపు నాగేశ్వరరావు, వేల్పూరి శ్రీనివాస్, విజయకుమార్, శ్రీనివాస్, అనంతనాయుడు, ఆకుల జయసత్య, అడపా బాబు తదితరులు ప్రసంగించారు.
ముద్రగడ దీక్ష విరమించాలని కాపు సమావేశం తీర్మానం
తుని ఘటనలో అరెస్ట్ అయిన వారిని విడుదల చేయాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్షను వెంటనే విరమించాలని కాపు సంఘాల సమాఖ్య సదస్సు తీర్మానించింది. చందు సాంబశివుడు ప్రవేశపెట్టిన తీర్మానాలను సమావేశం ఆమోదించింది. చంద్రబాబును కాపుమిత్రగా పేర్కొంటూ తీర్మానం ఆమోదించారు. కాపులను బీసీ జాబితాలో చట్టపరంగా చేస్చే వరకు అన్ని కాపుసంఘాలు సంయుక్త కార్యాచరణతో ముందుకెళ్లాలని, బీసీ జాబితాలో కాపులను చట్టపరంగా చేర్చే వరకు కాపులంతా సంయమనంతో వ్యవహరించాలని, పార్టీల కతీతంగా బీసీ జాబితాలో కాపులను చేర్చేందుకు ప్రతి ఒక్కరి సహకారాన్ని కూడగట్టాలని, కాపు వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అభివృద్ధికి కృషి చేస్తున్న చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానించారు. ముద్రగడ తుని ఘటన దగ్గరినుంచి ఇప్పటి వరకు జగన్ డైరెక్షన్‌లో ఉంటూ కాపులకు నష్టం చేస్తున్నారని, ఆయన తీరును ఖండిస్తూ తీర్మానించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి కాపు కులనేతగా ముద్రగడ చెప్పుకుంటూ చెడ్డపేరు తేవడాన్ని ఖండిస్తూ తీర్మానించారు. జూన్, జూలై నెలల్లో రాష్ట్రంలో మంజునాథ కమిషన్‌కు విజ్ఞాపనలు, వినతిపత్రాలు అందజేసి రిజర్వేషన్లు సాధించు కోవాలని, కాపు రిజర్వేషన్ చెడగొట్టేందుకు కుల ఘర్షణలు పెంచేందుకు జగన్ ప్రోద్బలంతో తునిలో జరిగిన విధ్వంసాన్ని ఖండిస్తూ తీర్మానించారు.