గుంటూరు

నృసింహాలయంలో స్తంభోద్భవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, ఏప్రిల్ 3: శ్రీ పానకాల లక్ష్మీ నృసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరుగుతున్న ఆస్థాన అలంకారోత్సవాల్లో ఆదివారం రాత్రి ఆలయ ముఖ మండపంలో స్తంభోద్భవం అలంకారం చేశారు. పట్టణ పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి స్తంభోద్భవాన్ని నేత్రపర్వంగా తిలకించారు. ఈ అలంకారానికి కైంకర్యపరులుగా రావూరు శ్రీనివాసరావు, ఆస్థాన కైంకర్యపరులుగా వైజాగ్‌కు చెందిన అంగలూరి శఠకోపాచార్యులు వ్యవహరించారు. స్తంభోద్భవం అలంకారం విశిష్టతను ఉపప్రధాన అర్చకులు దీవి అనంత పద్మనాభాచార్యులు భక్తులకు వివరించారు. ధర్మకర్తల మండలి సభ్యులు వెనిగళ్ల ఉమాకాంతం, ఆలేటి నాగలక్ష్మి, రావుల శ్రీనివాసరావు, కోసూరు శివనాగరాజు, ఊట్ల శ్రీమన్నారాయణ, ఎవి సాంబశివరావు, మోరంపూడి నాగేశ్వరరావు, పంచుమర్తి ప్రసాద్, దీవి అనంత పద్మనాభాచార్యులు పాల్గొన్నారు. ఆలయ ఇఓ మండెపూడి పానకాలరావు పర్యవేక్షించారు. సోమవారం స్వామివారికి కాళీయ మర్దనం అలంకారం జరుగుతుందని పానకాలరావు తెలిపారు.