గుంటూరు

హిల్లరీ క్లింటన్ గెలిస్తేనే భారత్‌కు మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), జూన్ 17: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు, రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌కు మధ్య జరిగే పోటీల్లో హిల్లరీ క్లింటన్ విజయం వలన భారత్‌కు ప్రయోజనం చేకూరుతుందని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. శుక్రవారం అరండల్‌పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో అమెరికా ఎన్నికలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ అమెరికా ప్రజలు తమ దేశ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో 22 శాతం మిలటరీ పరిశ్రమలపై ఆధారపడి ఉందని, అందువలన అమెరికా నిరంతరం ప్రపంచ వ్యాప్తంగా ఘర్షణలు జరగాలని కోరుకుంటుందన్నారు. ఈ ఘర్షణల వలన ఇరు దేశాలకు ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకునేది అమెరికాయేనన్నారు. ఇందుకు భారత్, పాకిస్థాన్‌లే ఉదాహరణ అన్నారు. అమెరికా దేశ బహుళజాతి కంపెనీలు ప్రపంచంలోని అన్ని దేశాల్లో వ్యాపారాలు చేసి లాభాలు గడిస్తాయన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ వివిధ మతాల మధ్య శాంతికి భంగం కల్గించే వ్యాఖ్యలు చేయడమే కాక భారత్, చైనా వంటి దేశాల్లో అవుట్‌సోర్సింగ్ వ్యాపార ఒప్పందాలు రద్దు చేస్తామని చెప్పడం మన ప్రయోజనాలకు నష్టం కల్గించే విధంగా ఉన్నాయన్నారు. విశ్రాంత రాజనీతిశాస్త్ర శాఖాధిపతి ఎన్ తిరుపతయ్య మాట్లాడుతూ అమెరికా ప్రజలు చైతన్యవంతులని అధ్యక్ష పాలన అక్కడ అమలులో ఉన్నా పద్ధతులన్నీ ప్రజాస్వామ్యయుతంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ప్రిన్సిపాల్ కె శ్రీమన్నారాయణ, ఎ హరి, కొండా శివరామిరెడ్డి పాల్గొన్నారు.