గుంటూరు

అనుమతి లేని ప్రైవేటు పాఠశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), జూన్ 17: అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు సాకిరి వెంకట చైతన్య కోరారు. శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ నగరంలోని కొన్ని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వ అనుమతులు లేకపోయినా విద్యార్థులు, తల్లిదండ్రులను ప్రలోభాలకు గురిచేస్తూ వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని, దీనిపై జిల్లా విద్యాశాఖాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు తాము చేరే కళాశాల, పాఠశాలలకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయో, లేదో తెలుసుకున్న తర్వాతే అడ్మిషన్ పొందాలన్నారు. ఈ సమావేశంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్డగడ్డ చిరంజీవి, నగర అధ్యక్షుడు రాయపాటి అమృతరావు, ప్రధాన కార్యదర్శి నవీన్, నాయకులు బిక్కూ నాయక్, భరత్, కళ్యాణ్, సిద్దు తదితరులు పాల్గొన్నారు.