గుంటూరు

ఎక్సైజ్ డ్యూటీని రద్దుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), ఏప్రిల్ 3: కేంద్రప్రభుత్వం బంగారు వస్తువుల తయారీపై ఒక శాతం విధించిన ఎక్సైజ్ డ్యూటీని వెంటనే రద్దుచేసేలా కృషి చేయాలని ది గుంటూరు నగర బంగారం, వెండి మర్చంట్ అసోసియేషన్ నాయకులు కోరారు. ఈ మేరకు ఆదివారం ఎంపి గల్లా జయదేవ్‌ను ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ 2012 సంవత్సరంలో బంగారంపై ఎక్సైజ్ డ్యూటీ విధిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆనాటి కాంగ్రెసేతర పార్టీల సహకారంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రద్దుపర్చుకున్నామన్నారు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం ఈ చట్టం చేయడం వలన ఎక్సైజ్ అధికారులు బంగారం వ్యాపారులపై తనిఖీల అధికారంతో వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. అలాగే చిన్న చిన్న తప్పులకు కూడా జైలుశిక్ష, షాపు సీజ్ చేయడం వంటి కఠిన నిబంధనలు కేంద్రప్రభుత్వం విధించడం అన్యాయమన్నారు. దేశంలోని బంగారు వ్యాపారస్థులు 34 రోజులుగా తమ దుకాణాలను మూసివేసి నిరవధికంగా సమ్మె చేస్తున్నప్పటికీ కేంద్రప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలోని విశిష్ఠస్థానం, అత్యంత నైపుణ్యం కల్గిన భారతదేశపు బంగారం తయారీని దెబ్బతీసే విధంగా చట్టాన్ని ప్రవేశపెట్టారన్నారు. ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో దేశంలో ఎలాంటి కొత్త పన్నులు విధించనని హామీ ఇచ్చి, నేడు బంగారం వర్తకులపై పన్ను విధించడం సరికాదన్నారు. మేక్ ఇన్ ఇండియా అనే నినాదంతో భారతదేశాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేస్తున్న మోదీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వలన వ్యాపారస్థులు రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు. ప్రధాని, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో తమ సమస్యలను తెలియజేసి ఎక్సైజ్ డ్యూటీని రద్దు పరిచేలా చూడాలని ఎంపి జయదేవ్‌ను కోరారు. ఎంపి స్పందిస్తూ బంగారు వర్తకుల ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.