గుంటూరు

నదీజలాలపై టి-ప్రభుత్వం తొండి, మొండి వాదనలు ఉపసంహరించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 23: కృష్ణానదీ జలాలపై తెలంగాణ ప్రభుత్వం తొండి, మొండి విధానాలను ఉపసంహరించుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు. గుంటూరు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండు రోజులుగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఆధ్వర్యంలో కృష్ణానదీ జలాల వినియోగంపై జరుగుతున్న సుదీర్ఘచర్చలో తెలంగాణ ప్రభుత్వం వితండ వాదానికి దిగుతున్నట్లు తేటతెల్లమైందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన విధంగానే కృష్ణాజలాలను వినియోగించుకోవాలే తప్ప ఏపి రాష్ట్రానికి ఇబ్బంది కల్గించడం సరికాదన్నారు. కృష్ణానదీ జలాల విషయంలో కేంద్రప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పరిష్కరించాలని, లేకుంటే తెలంగాణ ప్రభుత్వం సెంటిమెంట్‌గా మార్చి రాజకీయం చేసే అవకాశం ఉందన్నారు. కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులు, నీటి వినియోగంపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. నిర్ణయం తీసుకోవడంలో తాత్సారం చేస్తే ఇరురాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉందన్నారు. మేమే విభజన చట్టాన్ని తయారు చేశామన్న హరీష్‌రావుకు అందులో పొందుపర్చిన అంశాలు మర్చిపోయారా అని ప్రశ్నించారు. సెంటిమెంట్‌ను తెరపైకి తీసుకొచ్చి ఏపి ప్రజలను నిందించడం సరికాదన్నారు. వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి కృష్ణానదీ జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలమో, లేక ఆంధ్రాకు మద్దతిస్తారో తన వైఖరిని స్పష్టంచేయాలన్నారు.