గుంటూరు

రెండోవిడత రూ 11,065 కోట్లు రుణమాఫీ సొమ్ము జమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), జూన్ 23: రాష్ట్రప్రభుత్వం రెండేళ్లలో 11,065 కోట్ల రూపాయల రుణమాఫీ సొమ్మును 54.98 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జి మాల్యాద్రి పేర్కొన్నారు. స్థానిక అరండల్‌పేటలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 50 వేల రూపాయలలోపు రుణాలున్న 23.45 లక్షల సన్న, మధ్య తరగతి రైతులను పూర్తి రుణ విముక్తులను చేశామన్నారు. మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా 2.23 లక్షల మంది ఉద్యాన రైతులకు 384.47 కోట్లు ప్రభుత్వం ఇచ్చిందన్నారు. లోటుబడ్జెట్‌లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారన్నారు. రైతు కళ్లల్లో సంతోషం చూడటం కోసం రైతు రుణభారాన్ని చంద్రన్న తన భుజాలపై వేసుకున్నారన్నారు. మిగులు బడ్జెట్‌లో ఉన్న వైఎస్ ప్రభుత్వం 23 జిల్లాల ఏపికి రాష్ట్ర నిధుల నుండి రుణమాఫీకి ఇచ్చింది 1004 కోట్లు మాత్రమేనని, లోటుబడ్జెట్‌లో చంద్రబాబు ప్రభుత్వం 13 జిల్లాల ఆంధ్రాకు 11,065 కోట్లు ఇప్పటికే ఇచ్చిందన్నారు. రానున్న మూడేళ్లలో 24 వేల కోట్లతో రుణ విముక్తులను చేయనున్నారన్నారు. మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణ ప్రభుత్వం కేవలం లక్ష రూపాయలు మాత్రమే ప్రకటించగా రాష్ట్ర ప్రభుత్వం లక్షా 50 వేలు రైతు రుణమాఫీ ప్రకటించిందన్నారు. 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర బడ్జెట్ నుండి ఇంతమొత్తం రైతు రుణమాఫీ చేసిన దాఖలాలు లేవన్నారు. రుణమాఫీపై మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు గానీ, ఆ పార్టీ నేతలకు గానీ లేదన్నారు. రైతుల రుణమాఫీ చేయలేనని ఎన్నికల్లో చేతులెత్తేసిన జగన్ చంద్రబాబునాయుడు అమలు చేసి చూపిస్తుంటే ఓర్వలేక పోతున్నారన్నారు. ఈ అక్కస్సుతోనే చంద్రబాబుపై లేని పోని నిందారోపణలు చేయడం, అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.