గుంటూరు

నిర్వాసితులకు అనువుగాని స్థలాల కేటాయంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లి, జూన్ 23: పట్టణంలో రహదారుల విస్తరణ ఫలితంగా ఇళ్ళు కోల్పోయిన పేదలకు ఉండవల్లి కరకట్ట వద్ద గల గుంటూరు చానెల్ హెడ్ రెగ్యులేటర్ వద్ద 2.80 ఎకరాల స్థలాన్ని పేదలకు ప్లాట్‌లుగా విభజించి ఇవ్వటానికి అధికారులు నిర్ణయించారు. అయితే ఆ ప్రాంతమంతా పూర్తిగా పిచ్చిచెట్లు, గడ్డి, ముళ్ళపొదలతో నిండివుండటంతో గురువారం వాటిని శుభ్రం చేయిస్తున్నారు. కాగా సదరు 2.80 ఎకరాల స్థలం పల్లంగా ఉండటం, నల్లమట్టి నేల కావడంతో చిన్నపాటి వర్షం పడినా నీరు నిలిచిపోయి, నివాసానికి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి నెలకొంటుంది. అయితే పేదలకు అధికారులు కేటాయించిన స్థలాలను సిపిఎం నాయకులు దొంతిరెడ్డి వెంకటరెడ్డి, బూరగ వెంకటేశ్వరరావు పరిశీలించారు.