గుంటూరు

క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, జూన్ 23: దేహదారుఢ్యాన్ని కాపాడుకునేందుకు, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు క్రీడలు మార్గదర్శకాలుగా ఉంటాయని తెనాలి శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా ఒలంపిక్ అసోసియేషన్, జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఒలంపిక్ డే రన్ తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద శాసనసభ్యుడు క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఈరన్ గాంధీచౌక్, శివాజీ చౌక్, బుర్రిపాలెం రోడ్ మీదుగా వివేక సెంట్రల్ స్కూల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యార్థులు చదువులో చూపే ప్రతిభ క్రీడల్లో కూడా చూపించి ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలని సూచించారు. ప్రపంచ ఒలంపిక్స్‌లో మన క్రీడాకారులు ప్రతిసారి ఏదో ఒక బంగారు పతకాన్ని సాధిస్తూ దేశ కీర్తి ప్రపంచానికి చాటిచెబుతున్నారని పేర్కొన్నారు. ప్రతి మనిషికి క్రీడలు ఆహ్లాదాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తాయని, ఫలితంగా శారీరకంగా, మానసికంగా సంతోషంగా ఉండే అవకాశం ఉందన్నారు. జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపిచంద్ మాట్లాడుతూ జిల్లా నుండి ఒలంపిక్‌కు క్రీడాకారులు తీసుకు వెళ్ళేందుకు ప్రతి సంవత్సరం బిఆర్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని, వారిలో ప్రతిభను వెలికితీసి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి పంపుతామన్నారు. కార్యక్రమంలో డిఎస్పీ రమణమూర్తి, మున్సిపల్ కమీషనర్ కె శకుంతల, శాప్ ఓఎస్‌డి రామకృష్ణ, వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ, జెడ్పీటిసి అన్నాబత్తుని జయలక్ష్మి, వివిధ క్రీడా సంఘాల కార్యదర్శులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.