గుంటూరు

భూమి చదును ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుళ్లూరు, జూన్ 24: రాజధాని పరిధిలో భూములిచ్చిన రైతులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు రాష్ట్రప్రభుత్వం అన్ని చర్యలు పూర్తిచేసింది. ఈ క్రమంలో నేలపాడు రెవెన్యూ పరిధిలో భూమి చదును పనులను గురువారం రాత్రి ప్రారంభించారు. సుమా రు 1200 ఎకరాల భూమిలో చెట్లు, ముళ్ల కంపలను తొలగించారు. పొక్లయినర్లతో నీటికుంటలు, పంట కాల్వలను పూర్తిచేసి బుల్డోజర్లతో భూమిని చదును చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా తుళ్లూరు సిఆర్‌డిఎ ప్రాంతీయ కార్యాలయంలో లాటరీ ద్వారా రైతులకు నివేశన స్థల పట్టాలను శనివారం అందజేయనున్నారు. జెసి శ్రీ్ధర్ ఆదేశాల మేరకు నేలపాడు రెవెన్యూ పరిధిలో ముందుగా భూమి చదును పనులు ప్రారంభించి లేఅవుట్ ప్రకారం రైతులకు ప్లాట్లను మార్కింగ్ చేసి ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.