గుంటూరు

రాజధాని ప్రాంతంలో మావోయిస్టుల కదలిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుళ్లూరు, ఏప్రిల్ 5: తుళ్లూరు మండలం, తాళ్లాయపాలెం గ్రామంలో మావోయిస్టుల కదలిక సంచలనం సృష్టించింది. ప్రత్యేక నిఘా విభాగం పోలీసులు నిఘా పెట్టి బూతం అన్నపూర్ణ అలియాస్ అరుణక్క అనే మావోయిస్టును అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆమె బంధువుల ఇంటికి వచ్చినట్లు తెలుసుకున్న పోలీసులు మంగళవారం ఉదయం నుండే నిఘా వేశారు. తిరిగి బయలుదేరే సమయంలో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి అరుణక్కను అదుపులోకి తీసుకుని, విజయవాడ తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈమె ఛత్తీస్‌ఘడ్ ఏరియాకు చెందిన నరసింహారావు అలియాస్ జగ్గన్న భార్యగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం రాజధాని అభివృద్ధి ప్రాంతంలో మావోయిస్టుల కదలిక ప్రారంభం కావడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు పోలీసు విభాగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.