గుంటూరు

ప్రజా రాజధాని కాదిది.. పాలకుల భోజదాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూన్ 28: అమరావతి నగరం పేరిట 29 గ్రామాల్లో ప్రభుత్వం నిర్మిస్తున్న రాష్ట్ర రాజధాని ప్రజా రాజధాని కాదని, పాలకుల భోజదానిగా మారిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) విమర్శించారు. మంగళవారం నాడిక్కడ తన కార్యాలయంలో ఆర్కే విలేఖర్లతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి స్విస్ ఛాలెంజ్ ఒప్పందంపై సంతకాలు చేస్తున్న అధికారులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతితో పాలుపంచుకుంటున్న కిందిస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు భవిష్యత్తులో జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదని అన్నారు. కేంద్రప్రభుత్వ నిధులతో రాజధాని నిర్మాణంలో భవనాలన్నింటినీ తానే నిర్మిస్తానని చెప్పిన చంద్రబాబు ప్రధాని నరేంద్రమోదీని నిలదీసి నిధులు ఎందుకు సాధించలేక పోతున్నారని ఆయన ప్రశ్నించారు. తాత్కాలిక రాజధాని నిర్మాణమే సంవత్సరాలు పడితే శాశ్వత రాజధాని నిర్మాణం ఎనే్నళ్లు పడుతుందోనని ఆర్కే ప్రశ్నించారు. కోర్ క్యాపిటల్ విదేశీ సంస్థలకు భూములు కేటాయించడంతో పాటు ఆ భూములకు రహదారులు, డ్రైనేజీలాంటి వౌలిక వసతులు ప్రభుత్వం కల్పించేందుకు ఐదువేల కోట్లు ఖర్చు పెడితే మరి విదేశీ సంస్థలు ఏం నిర్మిస్తాయని ఆయన అన్నారు. స్వదేశీ సంస్థలను, మేధావులను చంద్రబాబు అవమాన పరుస్తున్నారని ఆర్కే ధ్వజమెత్తారు. 99 ఏళ్లు రాజధాని ప్రజలు విదేశీ సంస్థలకు యూజర్‌చార్జీలు, టోల్‌చార్జీలు, డెవలప్‌మెంట్ చార్జీలు చెల్లించి వారికి బానిసలుగా బతకాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పించడం దుర్మార్గమైన చర్య అని ఆయన అన్నారు. సింగపూర్ సంస్థలతో భవిష్యత్తులో ప్రభుత్వం ఒప్పందం రద్దు చేసుకుంటే 10 రెట్లు పరిహారం చెల్లించాలని నిబంధనలు పెడుతున్నారంటే చంద్రబాబు ఆయన కుమారుడు ఆ స్థాయిలో అవినీతికి పాల్పడి దోచుకుంటున్నారా అని అనుమానంగా ఉందని ఆర్కే అన్నారు. ప్రజల సొమ్ము 10 రూపాయలు కూడా ఎవరూ చెల్లించరని, ఒప్పందం రద్దైనా చంద్రబాబు , లోకేష్‌ల అవినీతి సొమ్ములోంచి చెల్లించాల్సిందేనని ఆర్కే అన్నారు. కోర్ క్యాపిటల్ గ్రామాలైనా లింగాయపాలెం, తాళ్లాయపాలెం, మందడం, ఉద్దండరాయునిపాలెం గ్రామాలను తొలగిస్తే ఆయా గ్రామాల్లో నిర్వాసితులకు ఎక్కడ నివాసాలు నిర్మించి ఇస్తారని, రైతుల భూములకు స్థలాలు ఎక్కడ కేటాయిస్తారో ముందే చెప్పాలని ఆర్కే డిమాండ్ చేశారు. అన్న క్యాంటిన్‌లను ఒక్క తాత్కాలిక సచివాలయం వద్దే కాకుండా రాజధాని 29 గ్రామాల్లో ఏర్పాటు చేయాలని ఆర్కే డిమాండ్ చేశారు.