గుంటూరు

చదవండి.. మొక్కలు పెంచండి.. ఆడుకోండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, జూన్ 28: విద్యార్థులారా మీరు బాగా చదవండి.. మొ క్కలు పెంచండి.. ఆడుకోండి... మీరు కూడా నా అంతటి వారు కావాల ని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు చిన్నారులనుద్దేశించి అన్నారు. మంగళవారం స్థానిక కోడెల శివప్రసాదరావు స్టేడియంలో నరసరావుపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘హరిత నగరంపై అడుగులు’ అనే మొ క్కలు నాటే కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా అధ్యక్షత వహించారు. చదువుల తల్లిగా నరసరావుపేట పట్టణాన్ని మార్చామన్నారు. విద్యార్థులు ఎంత చదువైనా న రసరావుపేటలో చదువుకోవచ్చన్నారు. ఆటలు ఆడుకునేందుకు 200 కోట్లతో స్టేడియం ఏర్పాటు చేశామన్నారు. ఈ స్టేడియంలో అన్ని హంగులు ఉన్నాయన్నారు. ఒకటిన్నర సంవత్సరాల్లో ఇదే స్టేడియంలో స్విమ్మింగ్‌ఫూల్ ఏర్పాటు చేస్తామన్నారు. 70 కోట్ల రూపాయలతో 300 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. మొ క్కలు నాటడం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. మొ క్కలను నాటటమే కాకుండా వాటిని పర్యవేక్షించాలన్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో 25వేల ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసుకోవాలని సూ చించారు. యువ నాయకుడు కోడెల శివరాం మాట్లాడుతూ ఈ నియో జకవర్గం భవిష్యత్‌లో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. మున్సిపల్ కమిషషర్ భానూప్రతాప్ మాట్లాడుతూ పట్టణంలో ఎవరికి ఎన్ని మొక్కలు కావాలన్నా వారికి అందజేస్తామన్నారు. మొక్కలను పెంచేందుకు మహిళలు, డ్వాక్రా మహిళలు సహకరించాలన్నారు. రావిపాడు రోడ్డులో కాసు బ్రహ్మానందరెడ్డి మున్సిపల్ పార్కు ప్రహరీ నిర్మాణానికి 50 లక్షలతో టెండర్లు పిలిచామన్నారు. అందులో సీనియర్ సిటిజన్స్‌కు, చిన్నారులకు యోగా సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆరు నెలల్లో పార్కు పూర్తి హం గులతో ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. అమృత పథకం కింద ఎన్జీవో కాలనీలో 50 లక్షలతో పార్కు ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అదే విధంగా శ్మశానాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామన్నారు. ఆర్డీవో గంధం రవీందర్ మాట్లాడుతూ పర్యావరణంలో జీవించాలంటే అందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అటవీ శాఖ మొక్కలను అందచేస్తుందని, వాటిని అందరూ వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మీరావలి, మాజీ మున్సిపల్ చైర్మన్ వనమా సుబ్బారావు, కౌన్సిలర్లు, అధికారులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, పలు పాఠశాలల, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుండి సత్తెనపల్లి రోడ్డులోని స్టేడియం వరకు స్పీకర్, అధికారులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.