గుంటూరు

రిటైర్డ్ పోలీసు సిబ్బందికి ఘన సన్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, జూన్ 30: పోలీసు శాఖలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించి పదవీ విరమణ చేస్తున్న పలువురిని స్థానిక డిఎస్‌పి కార్యాలయంలో గురువారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించి, వీడ్కోలు పలికారు. డివిజన్ పరిధిలోని ముప్పాళ్ళ పోలీస్టేషన్ ఎఎస్‌ఐ పఠాన్ మాబుసుభాని, రూరల్ పోలీస్టేషన్ హెడ్ కానిస్టేబుల్ షేక్ దాదా సాహెబ్, అచ్చంపేట పోలీస్టేషన్ ఎఎస్‌ఐ అన్నలదాసు పురుషోత్తంలను డిఎస్‌పి మధుసూదనరావు ఘనంగా సన్మానించారు. విధి నిర్వహణలో వీరు మచ్చలేని వ్యక్తులని కొనియాడారు. ముప్పాళ్ళ ఎస్‌ఐ యంపరాల అచ్చయ్య, అచ్చంపేట ఎస్‌ఐ జి రాజేశ్వరరావు, రూరల్ ఎస్‌ఐ కె వెంకట్రావు వారివారి సిబ్బందిని ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌లోని పోలీసు సిబ్బందితో పాటు పదవీ విరమణ చేస్తున్న వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.