గుంటూరు

అగ్రిగోల్డ్ బాధితుడు, రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినుకొండ, జూన్ 30: మండలంలోని నాగులవరం గ్రామానికి చెందిన మ ద్దుల చెన్నారెడ్డి (75) అనే రైతు, అగ్రిగోల్డ్ బాధితుడు అప్పుల బాధతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. అగ్రిగోల్డ్ సంస్థకు కట్టిన డబ్బులు రాకపోవడమే కాకుండా తెచ్చిన అప్పులు తీర్చలేక ప్రకాశం జిల్లా డోర్నాల వద్ద ఉన్న స్థలాన్ని విక్రయించి అప్పులు తీరుస్తానని భార్య వెంకటలక్ష్మికి చెప్పి మంగళవారం ఇంటి నుండి వెళ్ళారు. మృతుడు డోర్నాల వెళ్ళి స్థలం అమ్ముతానని చెప్పగా, ప్రస్తుతం స్థలాలకు డిమాండ్ లేదని, కొనుగోలు చేసే వారు లేరని బ్రోకర్ చెప్పాడు. నిరాశకు గురైన చెన్నారెడ్డి వినుకొండ వచ్చి బుధవారం రాత్రి స్థానిక స్వాగత్ లాడ్జిలో బస చేశారు. గురువారం ఉదయం ఎంతసేపటికీ తలుపు తెరవకపోవడంతో తలుపు తీసి చూడగా చెన్నారెడ్డి పురుగుమందు తాగి మృతి చెంది ఉండడాన్ని గమనించారు. పోలీసులకు సమాచారం అందించగా పట్టణ ఎస్‌ఐ నారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య వెంకటలక్ష్మి, కుమారుడు ఉన్నారు. వినుకొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.