గుంటూరు

రిజిస్ట్రేషన్ల అనుసంధానంపై పునరాలోచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 30: భూముల రిజిస్ట్రేషన్ల అనుసంధానం ప్రక్రియను రెండు నెలలపాటు వాయిదావేయాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. రాష్ట్రంలోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు పూర్తయిన సెకన్లలోపే ఆ సమాచారం రెవెన్యూ కార్యాలయాలకు చేరేవిధంగా ఆటోమోటిఫికేషన్ ప్రక్రియను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూలై ఒకటి నుంచి ఈ విధానం అమలులోకి రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం రెవెన్యూ ఉద్యోగులు పల్స్ సర్వే పనిలో నిమగ్నమయ్యారు. భోజన విరామ సమయం మినహా మిగిలిన పనిగంటలు సర్వేకే కేటాయించాల్సి వస్తోంది. దీంతో ఈ ప్రక్రియను రెండు నెలల పాటు వాయిదావేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి నివేదించాయి. ఈ మేరకు ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. ఆటోమోటిఫికేషన్ ప్రక్రియ ప్రవేశపెడితే భూ యజమానులు, రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు, ఇతర ధ్రువీకరణపత్రాలను వెనువెంటనే రెవిన్యూశాఖ అందించాలి. ఈ విధానాన్ని ఇప్పుడే అమలుచేస్తే మండల తహశీల్దార్లు, ఇతర సిబ్బందిపై పనిభారం పెరుగుతుందని రెవెన్యూ ఉద్యోగవర్గాలు వాదిస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో భూ సంబంధిత లావాదేవీలు పెరిగాయి. గతంలో రెండు లక్ష మంది జనాభా ప్రాతిపదికన రెవెన్యూ మండలాలను వర్గీకరించి తహశీల్దార్లను నియమించారు. పాతికేళ్ల క్రితం విభజించిన మండలాల్లో ప్రస్తుతం జనాభా రెట్టింపయిందని చెబుతున్నారు. దీంతో రెండున్నర లక్షల మందికి ఒక తహశీల్దారును నియమించాలనే ప్రతిపాదన కూడా ముందుకొచ్చింది. కొన్ని జిల్లాల్లో అర్బన్ జిల్లా తహశీల్దార్లను కొత్తగా నియమించాల్సి ఉంది. దీనికితోడు రాజధాని, రెవిన్యూ యేతర శాఖల కార్యకలాపాలకు కొంతమందిని డెప్యూటేషన్‌పై నియమించారు. దీంతో రెవెన్యూశాఖలో అందుబాటులో ఉన్న సిబ్బందితోనే ప్రభుత్వం పల్స్‌సర్వే నిర్వహిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ మోటిఫికేషన్ ప్రవేశపెట్టి వెనువెంటనే పట్టాదారు పాసు పుస్తకాలు.. ఇతర ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయటం కష్టతరమవుతుందని చెప్తున్నారు. పల్స్‌సర్వేకు ముందు కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ అసైన్డు భూముల గుర్తింపు వివరాలను పూర్తిచేసి అందించామని నాలుగు ప్రొఫార్మాల ప్రకారం భూముల గుర్తింపు నిర్వహించాల్సి వచ్చిందని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. పని ఒత్తిడి కారణంగా నేటి నుంచి ప్రారంభం కావాల్సిన ఆటోమోటిఫికేషన్ ప్రక్రియను వాయిదావేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పబ్బరాజు వెంకటేశ్వరరావు తెలిపారు.