గుంటూరు

జూట్‌మిల్లు సమస్య పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 1: జూట్‌మిల్లుకు అక్రమ లాకౌట్ పడి ఏడాది గడుస్తున్నా సమస్యను పరిష్కరించడంలో ప్రభు త్వం పూర్తిగా విఫలమైందని జూట్‌మిల్లు పరిరక్షణ సమితి కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు విమర్శించారు. శుక్రవారం అరండల్‌పేటలోని స్ఫూర్తి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ భజరంగ్ జూట్‌మిల్లు వ్యవహారంలో ప్రభుత్వంపై అమీతుమీ తేల్చుకునేందుకు పరిరక్షణ కమిటీ సిద్ధంగా ఉందన్నారు. మిల్లునైనా తెరవండి.. జైళ్లోన్నైనా పెట్టండి అనే నినాదంతో కార్మికుల కుటుంబాలతో కలిసి ఈనెల 4వ తేదీన భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. జూట్‌మిల్లు నుండి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు. కార్మికులకు 40 శాతం వాటా కల్పిస్తామని ప్రభుత్వానికి హామీ ఇచ్చిన యాజమాన్యం మిల్లును నడుపుతూనే ధనార్జనే ధ్యేయంగా మిల్లుకు అక్రమ లాకౌట్ చేశారన్నారు. దశాబ్దాలుగా కార్మికులకు జీవనోపాధి కల్పిస్తున్న మిల్లు నేడు యాజమాన్యం స్వార్థం కారణంగా కార్మికులు కాలే కడుపులతో జీవించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. 40 శాతం వాటా హక్కు ఉన్న కార్మికులను కాదని మిల్లును అమ్ముకునే హక్కు యాజమాన్యానికి ఎక్కడిదని అప్పిరెడ్డి, లక్ష్మణరావు ప్రశ్నించారు. కార్మికులు లేరనే సాకుతో యాజమాన్యం కల్లబొల్లి మాటలు చెప్పడంతో పరిరక్షణ సమితి ఎంతమంది కార్మికులు కావాలన్నా తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉందని యాజమాన్యానికి స్పష్టంచేసినా మిల్లు తెరిచేందుకు ముందుకు రాలేదన్నారు. మిల్లును అమ్ముకోవాలనే లక్ష్యంతో ఉన్న యాజమాన్యం 60 కోట్ల నష్టంలో మిల్లు ఉందని చెప్తుందే తప్ప ఈ విషయంపై ప్రభుత్వానికి స్పష్టత ఇవ్వడం లేదన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో పాటు అన్నివర్గాల ప్రజలను ఏకతాటిపైకి తెచ్చి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ముందుకు సాగుతామని స్పష్టంచేశారు. సమావేశంలో సీనియర్ న్యాయవాది వైకె, సమితి సభ్యులు జంగాల అజయ్‌కుమార్, భావన్నారాయణ, రావి నాగేశ్వరరావు, పాండు పాల్గొన్నారు.