గుంటూరు

వ్యాపారి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (క్రైం), జూలై 3: నగరానికి చెందిన ఓ ఎలక్ట్రికల్ వ్యాపారస్థుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హతమార్చిన సంఘటన నగరంలో చోటు చేసుకుంది. స్థానిక మంగళగిరి రోడ్డులోని నవభారత్ కాలనీ 1వ లైనుకు చెందిన సాంబశివరావు (70) జిన్నాటవర్‌లోని ఎలక్ట్రికల్ హోల్‌సేల్ వ్యాపారం చేస్తుంటాడు. మొదటి భార్య చనిపోయి పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. ఇంట్లో ఒంటరిగా ఉండే ఇతన్ని శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి పడుకుని ఉన్న అతన్ని కత్తితో పొడిచి హతమార్చి, మృతుడి ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. ఆదివారం ఉదయం ఇంటికి వచ్చిన పనిమనిషి రక్తపు మడుగుల్లో పడివున్న సాంబశివరావును చూసి స్థానికుల సాయంతో పాత గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగప్రవేశం చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం కారణంగా ఈ హత్య జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.