గుంటూరు

జేఎన్‌టీయూకేతో విద్యారంగ అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, జూలై 4: జేఎన్‌టీయూకే అనుబంధ ఇంజనీరింగ్ కళాశాల నరసరావుపేటకు రా వడం విద్యారంగానికి, విద్యా వికాసానికి, ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో ఉపయోగపడనుందని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. సోమవారం స్థానిక భువనచంద్ర టౌన్‌హాల్లో ‘నరసరావుపేటలో విద్యావ్యవస్థలో మరో మణిహారం జేఎన్‌టీయూకే’ అనే అంశంపై జరిగిన రౌండ్ టౌబుల్ సమావేశంలో వివరించారు. ఈ కార్యక్రమానికి జేఎన్‌టీయూకే వైస్‌చాన్స్‌లర్ విఎస్‌ఎస్ కుమార్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో కోడెల మాట్లాడుతూ జేఎన్‌టీయూకే నరసరావుపేటకు రావడానికి ముఖ్యవ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడని అన్నారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నరసరావుపేటకు వచ్చిన చంద్రబాబునాయుడు జేఎన్‌టీయూకే ఇస్తున్నట్లు ప్రకటించి, ఆ వాగ్దానాన్ని వెంటనే నెరవేర్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. రెండో వ్యక్తిగా ఆప్పటి మాజీమంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలకు అంకురార్పణ చేశారని, అనంతరం కళాశాల పరిశీలనా కమిటీ వచ్చి భూమిని గుర్తించినట్టు పేర్కొన్నారు. మూడో వ్యక్తి జేఎన్‌టీయూకే వైస్ ఛాన్సిలర్ వీఎస్‌ఎస్ కుమార్ అని, నాలుగో వ్యక్తిగా తాను ఉంటానని కోడెల స్పష్టం చేశారు. ఒకటిన్నర సంవత్సరాల కాలంలో జేఎన్‌టీయూకే సొంత భవనాల ఏర్పాటు జరుగుతుందన్నారు. జేఎన్‌టీయూకే క్యాంపస్ సమీపంలోనే ముస్లిం మైనార్టీలకు ఐటీఐ కళాశాల, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇందుకోసం కేంద్ర మంత్రి నజ్మాహెప్తుల్లా 9.50 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారని పేర్కొన్నారు. ఈనెల 15 నుండి పట్టణంలో పూర్తిస్థాయిలో సీసీ కెమేరాలను ఏర్పాటు చేస్తున్నామని కోడెల తెలిపారు. సమావేశంలో జేఎన్‌టీయూ ప్రిన్సిపల్ కేవీఎస్‌జీ మురళీకృష్ణ, రిజిస్ట్రార్ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, ప్రొఫెసర్ సాయిబాబు, ఆర్డీవో గంధం రవీందర్, తహశీల్దార్ విజయజ్యోతికుమారి, మున్సిపల్ చైర్‌పర్సన్ నాగసరపు సుబ్బరాయగుప్తా, వైస్ చైర్మన్ మీరావలి, కమిషనర్ భానూప్రతాప్, ఎంపీడీవో బాలూనాయక్ పాల్గొన్నారు.