గుంటూరు

‘బాబుపాలన దగా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెంటచింతల, జూలై 12: రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అని నమ్మి ఓట్లు వేశామని, అప్పులు తడిచి మోపెడై భారమవుతున్నాయని పాల్వాయిగేటు గ్రామస్థులు ఎమ్మెల్యే పినె్నల్లి రామకృష్ణారెడ్డి ఎదుట ఏకరువు పెట్టారు. మంగళవారం ఎమ్మెల్యే పినె్నల్లి రామకృష్ణారెడ్డి తన కార్యకర్తలతో పాల్వాయిగేటు గ్రామంలో గడప గడపకూ వెళ్ళి గ్రామస్థుల బాగోగులను తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ రెండేళ్ళుగా ఇళ్ళ స్థలాలు లేవు. బాబు వస్తే జాబు అన్నారు. జాబు రాకపోగా ఉన్న ఉద్యోగాలను తీసేశారని తీవ్రంగా విమర్శించారు. బాబు పాలన దగాపాలనగా కొనసాగుతుందన్నారు. దగాకోరు వ్యవస్ధ ఎక్కువ కాలం కొనసాగదన్నారు. వంద ప్రశ్నలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి దూసుకెళ్ళి జోహర్ వైయస్ రాజశేఖరరెడ్డి, జై జగన్ అంటూ వీధుల్లో నినాదాలు చేశారు. ఎమ్మెల్యే గడప గడపకు వెళ్ళి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను మనోభావాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గొల్లమారి పద్మ, ఉమామహేశ్వరరెడ్డి, నర్సిరెడ్డి, సత్యనారాయణ, నాసరరెడ్డి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.