గుంటూరు

సచివాలయం వద్ద ప్రమాదంలో గాయపడిన బాధితులకు వైసీపీ నేతల పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూలై 12: అమరావతి నగరం వెలగపూడిలో నిర్మాణంలో ఉన్న తాత్కాలిక సచివాలయంలో పిట్టగోడ కూలి గాయపడి, చినకాకాని ఎన్నారై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు బాధితులను మంగళవారం వైఎస్‌ఆర్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, తాడికొండ నియోజకవర్గ వైఎస్‌ఆర్ సీపీ ఇన్‌చార్జ్ క్రిస్టినా పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని వైద్యులకు వారు సూచించారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రపంచస్థాయి రాజధాని అని గొప్పలు చెప్పే చంద్రబాబు అక్కడ పనిచేసే కూలీలు గాయపడితే ప్రభుత్వ పరంగా కనీస చర్యలు చేపట్టలేదని, కార్మికశాఖ నుంచిగానీ, నిర్మాణ కంపెనీ నుంచిగానీ గాయపడ్డ వారిని పరామర్శించక పోవడం బాధాకరమన్నారు. రాజధాని నిర్మాణంలో బాధ్యతా రహితంగా వ్యవహరించడం సరికాదని అప్పిరెడ్డి, క్రిస్టినా పేర్కొన్నారు. పాటిబండ్ల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇలావుండగా రాజధాని నిర్మాణంలో భద్రత ఏదని, సిద్ధాంతులు నరబలి ఇవ్వమన్నారా అని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో కార్మికులు మరణిస్తున్నా, గాయాలపాలవుతున్నా భద్రత గురించి ఆలోచించకుండా నాణ్యతా లోపాలతో నిర్మాణాలు చేపడుతున్నారని, శ్లాబులు కుంగినా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే ఆర్కే పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న గోడకూలి నలుగురు కార్మికులు గాయపడ్డారని, మంత్రి నారాయణ ఏం సమాధానం చెబుతారోనని ఆర్కే అన్నారు. హడావిడిగా పనులు చేయిస్తూ కార్మికుల భద్రతను ప్రభుత్వం గాలికి వదిలేసిందని, ఇప్పటికైనా కాంట్రాక్టర్లపై తగిన చర్యలు తీసుకుని కార్మికులకు న్యాయం చేయాలని ఆర్కే అన్నారు. గాయపడ్డ వారికి కంపెనీ నష్టపరిహారంతో పాటు ప్రభుత్వపరంగా ఆదుకోవాలని ఆర్కే కోరారు.