గుంటూరు

మంగళగిరి ఎంవిఐ శివనాగేశ్వరరావు సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూలై 15: వాహనాల రిజిస్ట్రేషన్లలో అక్రమాలకు పాల్పడ్డ గుంటూరు జిల్లా మంగళగిరి మోటారు వాహనాల ఇన్‌స్పెక్టర్ కె శివనాగేశ్వరరావును సస్పెండ్ చేస్తూ రాష్ట్ర రవాణా శాఖామంత్రి శిద్దా రాఘవరావు ఆదేశాలు జారీచేసినట్లు శుక్రవారం రాత్రి తెలిసింది. అసలు వాహనాలే లేకుండా 27 వాహనాలు ఉన్నట్లు మంగళగిరి కార్యాలయంలో ఎంవిఐ శివనాగేశ్వరరావు రిజిస్ట్రేషన్ చేసినట్లు రవాణాశాఖ ఉన్నతాధికారుల విచారణలో తేలింది. దీంతో శివనాగేశ్వరరావును విధుల నుంచి సస్పెన్షన్ చేసినట్లు తెలిసింది. కొండపల్లిలో లారీ ట్రాన్స్‌పోర్టు కార్యాలయం నడిపే కొందరు వాహనాలు కొనుగోలు చేసినట్లు పత్రాలు చూపుతూ లేని వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిసింది. మంగళగిరిలోని కుప్పురావుకాలనీలో ఒక ఇంటి చిరునామాతో నలుగురు వ్యక్తుల పేరిట 27 వాహనాలు రిజిస్ట్రేషన్ అయినట్లు చెబుతున్నారు. ఇద్దరు రాష్ట్ర మంత్రుల ఒత్తిడి మేరకే ఎంవిఐ శివనాగేశ్వరరావు లొంగి ఈ రిజిస్ట్రేషన్లు చేసినట్లు మంగళగిరి ప్రాంతంలో ప్రచారం జరుగుతోంది. కంపెనీ నుంచి డీలర్‌కే చేరని వాహనాల పత్రాలను చూపి రిజిస్ట్రేషన్ చేయించడం వెనుక ఎవరెవరి పాత్ర ఉందో రవాణాశాఖ ఉన్నతాధికారులు లోతుగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం.