గుంటూరు

ఉడ్ కార్మికులకు స్థలం కేటాయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూలై 17: ఉడ్ కార్మికులు తమ వృత్తిని కొనసాగించుకునేందుకు ప్రభుత్వం పట్టణంలో స్థలం కేటాయించాలని ఎఐటియుసి జిల్లా కా ర్యదర్శి వెలుగూరి రాధాకృష్ణ డిమాండ్‌చేశారు. ఆదివారం స్థానిక సిపిఐ కా ర్యాలయంలో ఉడ్ టర్నింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశం ఎన్ రామస్వా మి అధ్యక్షతన జరిగింది. రాధాకృష్ణ మాట్లాడుతూ ఉడ్ వర్క్‌నే జీవనోపాధిగా చేసుకుని ఎంతోమంది కార్మికులు పనిచేస్తున్నారని, అద్దెషాపుల్లో వృత్తిని కొనసాగిస్తున్నందున అద్దెలు పెరిగి ఆర్థికంగా భారం అవుతోందని అన్నా రు. ప్రభుత్వం వీరికి ఎటువంటి రు ణాలు ఇవ్వడంలేదని, అద్దె, విద్యుత్ చార్జీలు భారం కావడంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గుర్తింపు కార్డుల కోసం కార్మిక శాఖపై పోరాటం చేయాలని ఆయన అన్నారు. పిల్లలమర్రి నాగేశ్వరరావు, కె హరిబాబు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.