గుంటూరు

29న గుంటూరులో దేశీ విత్తన సంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 19: ఈనెల 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ ద్వితీయ దేశీ విత్తన సంబరాన్ని నిర్వహిస్తున్నట్లు హరిత భారతి ట్రస్ట్ ప్రతినిధి త్రినాథరావు పేర్కొన్నారు. మంగళవారం గుంటూరులో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో త్రినాథరావు మాట్లాడుతూ స్థానిక శ్రీ వెంకటేశ్వరా విజ్ఞాన మందిరంలో సంప్రదాయ విత్తన ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా అదేరోజు పాలేకర్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశీ విత్తనాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నామని, సదస్సుకు హాజరైన వారికి 5 రకాల దేశీ వరి విత్తనాలు ఒక్కొక్కరికీ 100 గ్రాముల చొప్పున, కంది విత్తనాలు 100 గ్రాముల చొప్పున ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి టి విజయ్‌కుమార్, రిటైర్డ్ డిజిపి పి ప్రసాదరావు, ఎపి సెక్రటేరియట్ ఎంప్లాయాస్ అసోసియేషన్ అధ్యక్షుడు యు మురళీకృష్ణ తదితరులు హాజరు కానున్నట్లు తెలిపారు.