గుంటూరు

ప్రేమ స్వరూపునికి పుష్పాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), జూలై 19: మహాపర్వదినాల్లో ఒకటిగా ఉన్న గురుపౌర్ణమి మహోత్సవాన్ని మంగళవారం నగరంలోని వివిధ డివిజన్లలో ఆయా భక్తబృందాలు, పలు ధార్మిక సంస్థల ఆధ్వర్యాన రోజంతా మహా వైభవంగా జరుపుకున్నారు. అష్టాదశ పురాణాలను యావత్ విశ్వానికి అందించి, రుషిలోక అరాధ్యుడుగా విఖ్యాతిపొందిన శ్రీవ్యాస భగవానుని జన్మదినాన్ని ప్రతియేటా గురుపౌర్ణమి ఉత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఇదేరోజున కోట్లాది మంది ఆరాధించే సాయినాథుడు కూడా షిరిడి ప్రాంతంలో అవతరించడాన్ని పురస్కరించుకుని స్వామివారి భక్తులంతా ఉత్సవాన్ని శ్రద్ధాశక్తులతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నగరంలోని 21 చిన్న, పెద్ద సాయి మందిరాలు, ఆలయాల్లో మంగళవారం తెల్లవారుఝాము నుంచే ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఆర్ అగ్రహారంలోని షిరిడిసాయినాథుని మందిరంలో జరిగిన గురుపౌర్ణమి వేడుకల్లో వందలాది మంది భక్తులు బాబాను దర్శించుకున్నారు. విద్యానగర్‌లోని శ్రీ సాయినాథ సన్నిదానంలో అఖండ నామ సప్తాహం జరిగింది. పెద్దసంఖ్యలో భక్తులు బాబాను సేవించుకున్నారు. బ్రాడీపేట 4వ లైనులోని అభయహస్త శ్రీసాయినాథుని మందిరంలో షిరిడి సంప్రదాయానికి అనుగుణంగా తెల్లవారు ఝామున 5.15 గంటలకు మొదటి హారతిగా అర్పించారు. మహాభక్తులు రచించిన భక్తిగీతాలను, శ్లోకాలను భక్తజనం ఆలపించింది. హౌసింగ్‌బోర్డు కాలనీ, బ్రాడీపేట ఓంకారక్షేత్రం, జూట్‌మిల్లులోని శివాలయం, అరండల్‌పేటలోని ప్రసిద్ధ సాయినాథుని సుందర మందిరం, పాత గుంటూరులోని పలు ఆలయాల్లో కొలువైయున్న సాయిబాబా వారికి రోజంతా ప్రత్యేక అర్చనలు, పూజలు జరిగాయి. ముఖ్యంగా సాయంకాలం పల్లకిసేవను నేత్రపర్వంగా నిర్వహించారు. విజ్ఞాన మందిరంలో జరుగుతున్న సాయినామ సప్తాహంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని నామస్మరణ చేశారు. బాబావారికి ఇష్టమైన అన్నప్రసాద వితరణ భారీగా జరిగింది. పలు రంగాలకు చెందిన ప్రముఖులు సాయిమందిరాలకు తరలివెళ్లి బాబాను సేవించుకున్నారు. వ్యాస భగవానుడిని స్మరించుకుంటూ కృష్ణ మందిరాలకు వెళ్లి విష్ణు సహస్రనామ పారాయణలు చేశారు.