గుంటూరు

30 వేల మొక్కలతో వనం-మనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కార్పొరేషన్), జూలై 26: రాష్ట్ర ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వనం - మనం కార్యక్రమంలో భాగంగా నగరంలో సుమారు 30 వేల మొక్కలను నాటేందుకు కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం కౌన్సిల్ సమావేశ మందిరంలో వార్డు లెవల్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ నాగలక్ష్మి మాట్లాడుతూ జులై 29వ తేదీన నగరంలోని 62 వార్డులలో 30 వేల మొక్కలు నాటబోతున్నట్లు తెలిపారు. గృహ యజమానులకు రెండు మొక్కల చొప్పున ఒక్కో వార్డుకు 500 మొక్కలు, 10 రకాల పూల, పండ్ల మొక్కలను అందజేయనున్నట్లు వివరించారు. ఒక్కో వార్డుకు గులాబీ మొక్కలు 50, చైనా ఫాక్స్ 48, నందివర్ధనం 48, మందారం 48, మామిడి 48, ఉసిరి 48, జామ 48, నేరేడు 48, దానిమ్మ 48, నారింజ 48 మొక్కలను అందజేస్తామన్నారు. వార్డు లెవల్ అధికారులు జన్మభూమి కమిటీ మెంబర్లకు సమాచారం అందించి గృహ యజమానుల వివరాలు, వారు కోరిన మొక్కలు, డోర్ నెంబర్, యజమాని పేరు, పోన్ నెంబర్లను జూలై 28వ తేదీ మధ్యాహ్నం లోపు నగరపాలక సంస్థ కార్యాలయంలో అందజేయాలన్నారు. 28వ తేదీనే ఇంట్లో అడుగు లోతులో గుంటలు తవ్వుకోవాలని, 29న మొక్కలు నాటిన అనంతరం 30వ తేదీన జియో ట్యాగింగ్ ప్రక్రియ ద్వారా ఆన్‌లైన్ అనుసంధానం చేయాలన్నారు. జియో ట్యాగింగ్ ద్వారా మొక్క రెండు సంవత్సరాల పర్యవేక్షణ ఉంటుందని, యజమాని పర్యవేక్షణ స్వయంగా చూడాలని తెలిపారు. సమావేశంలో ఎసి కృష్ణకపర్ధి, డిసిలు యేసుదాసు, శ్రీనివాసరావు, ఎంహెచ్ ఓ నాగేశ్వరరావు, ఇ ఇలు రాంనాయక్, వెంకట్రావు, చిన కోటేశ్వరరావు, డిసిపి సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.