గుంటూరు

జీవ వైవిధ్య మ్యూజియం ఏర్పాటుకు సన్నాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 29: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న అమరావతిలో జీవ వైవిధ్య మ్యూజియం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ ప్రాజెక్టు సూపరింటెండింగ్ ఇంజనీరు ఎల్ జుంగో డోర్జి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఎన్విరాన్‌మెంట్ ప్రాజెక్టు సభ్యులు అమరావతిలో విస్తృతంగా పర్యటించి మ్యూజియం ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. ఈ బృందంతో ఎమ్మెల్యే శ్రీధర్ కూడా పర్యటించారు. రూ. 2 కోట్లతో జీవ వైవిధ్య మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తామని, పర్యాటక, ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా నిర్మాణాలు జరుపుతామన్నారు. ఈ బృందంలో రీజనల్ మ్యూజియమ్స్ డైరెక్టర్ వేణుగోపాల్, నేషనల్ అథారిటీ సభ్యులు కె శివప్రసాద్, డాక్టర్ వేణుగోపాల్, అమరావతి హెరిటేజి సిటీ అభివృద్ధి కమిటీ అడ్వయిజర్, గల్లా అమరేశ్వర్, దేవాదాయశాఖ ఏసి కెబి శ్రీనివాసరావు, ఈఓ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.