గుంటూరు

ప్రత్యేక హోదాపై కాంగ్రెస్, వైసీపీల హడావిడిని ప్రజలు నమ్మరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూలై 31: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో టిడిపి వెనకడుగు వేయదని, పోరాడుతుందని... తల్లీ పిల్ల కాంగ్రెస్‌లు ప్రత్యేక హోదా విషయంలో చేస్తున్న హడావిడిని రాష్ట్ర ప్రజలు విశ్వసించరని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. ఆదివారం సాయంత్రం ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి బట్టల దుకాణంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మంత్రి కిషోర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజనలో కాంగ్రెస్‌ది శకుని పాత్ర అని, అడ్డగోలు విభజనకు ఆనాడు బిజెపి సహకరించిందని, బిల్లు ప్రతులను యుద్ధవిమానంలో కాంగ్రెస్ పంపిందని ఆయన విమర్శించారు. ముఖ్యమంచ్రంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తుంటే కాంగ్రెస్, వైసీపీ నేతలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, హోదాకోసం పోరాడుతున్నట్లు ఫోజులు పెడుతున్నారని, తలకిందులుగా జపం చేసినా ప్రజలు వీరిని నమ్మరని కిషోర్‌బాబు అన్నారు. టిడిపి ఎంపీలు ప్రధానమంత్రిని కలిసి ప్రజల మనోభావాలు కోరిక రాష్ట్ర అవసరాలపై లిఖిత పూర్వక వినతిపత్రాన్ని అందిస్తానని, అప్పటికీ స్పందించకుంటే అనుసరించాల్సిన వ్యూహం కూడా టిడిపి రూపొందించుకుందని, కొందరు టిడిపి, బిజెపిల మధ్య అగాధం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే బిజెపితో పొత్తు పెట్టుకున్నామని, ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం నుంచి ప్రాజెక్టులు, నిధులు రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ఇబ్బందులను గమనించి ప్రత్యేక హోదా ఆలస్యమయ్యే పక్షంలో వనరులు, గ్రాంట్ల రూపేణా రాష్ట్రానికి మేలుచేస్తే బిజెపిని ప్రజలు విశ్వసిస్తారని కిషోర్‌బాబు అన్నారు. మంగళవారం ఉజకీయ పార్టీలు జరుప తలపెట్టిన బంద్ వలన ఎటువంటి ఉపయోగం ఉండదని మంత్రి కిషోర్‌బాబు అన్నారు. మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, వైస్‌చైర్మన్ సంకా బాలాజీగుప్తా, జడ్‌పిటిసి మెంబర్ ఆకుల జయసత్య, ఎఎంసి చైర్మన్ ఆరుద్ర భూలక్ష్మి, వనరాణి, సాయిప్రసాద్, ఉల్లయ్య, మునగాల సత్యనారాయణ పాల్గొన్నారు.