గుంటూరు

పొన్నూరులో విపక్షాల బంద్ విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొన్నూరు, ఆగస్టు 2: వైఎస్‌ఆర్ సిపి పిలుపుమేరకు ప్రత్యేకహోదా సాధనకు ఆ పార్టీ వర్గాలు, మిత్రపక్షాల మద్దతుతో మంగళవారం నిర్వహించిన పట్టణ బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్ సందర్భంగా వైసిపి నేత రావి వెంకట రమణ నేతృత్వంలో మిత్రపక్షాలైన ఉభయ కమ్యూనిస్టులు, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంగళవారం వేకువజామునుండే బస్‌డిపోల ఎదుట బైఠాయించి బస్సులను కదలనీయకుండా నియంత్రించారు. పోలీసులు వారిని తొలగించేందుకు ప్రయత్నించినా నిర్వాహకులు డిపో ఎదుట బైఠాయించి రవాణాను అడ్డుకున్నారు. అనంతరం గాంధీబొమ్మ సెంటర్‌కు చేరుకున్న సమయంలో మార్కెట్‌వైపు వెళ్తుండగా పోలీసులు తిరిగి బంద్ నిర్వాహకులను అడ్డుకున్నారు. స్థానిక శాసనసభ్యుడి నేతృత్వంలో తెలుగుదేశం కార్యకర్తలు పాత బస్టాండ్ సెంటర్‌లో నిరసన కార్యక్రమం జరుపుతున్నందున అటుగా వెళ్లేందుకు అంగీకరించేది లేదని సిఐ కోటేశ్వరరావు వారిని అడ్డగించేందుకు విఫలయత్నం చేశారు. అరెస్ట్ చేస్తామన్న పోలీసుల బెదిరింపులను లెక్కజేయక రావి బృందం ముందుకుసాగి ట్రాఫిక్ ఐలాండ్ సెంటర్‌కు చేరుకుని అక్కడ బైఠాయించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణిని దుయ్యబడుతూ బంద్ నిర్వాహకులు మాట్లాడారు. ఇలా ఉండగా ఈ శిబిరానికి కొద్ది అడుగుల దూరంలోని స్థానిక ఎమ్మెల్యే నరేంద్రకుమార్ నేతృత్వంలో ఆ పార్టీవర్గాలు ప్రత్యేకహోదా సాధనకు నిరసన దీక్ష కొనసాగించడం గమనార్హం. బంద్ వైసిపి నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకట రమణ, ఆ పార్టీ జిల్లా నాయకుడు సతీష్‌రెడ్డి, సిపిఐ నేత ఆరేటి రామారావు, సిపిఎం నేతలు ప్రభుదాసు, నాగేశ్వరరావు, పరశురామయ్య, ఆమ్ ఆద్మీపార్టీ నేత గాజుల నాగభూషణం, కాంగ్రెస్ నాయకులు సజ్జా కృష్ణబాబు, వైసిపి నేతలు బి వేణుప్రసాద్, చిగురుపాటి సుబ్బారావు, పఠాన్‌బాబు, గేరా సుబ్బయ్య, తజ్ముల్‌బేగ్, వడ్రాణం ప్రసాదరావు, గణేష్, వాహెదుల్లా, సఫైతుల్లా, మొల్లా కరీమ్, మునిసిపల్ కౌన్సిలర్లు నయింబాషా, శివనాగరాజు, మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు.