గుంటూరు

హోదాపై కాంగ్రెస్, వైసిపి నాటకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 4: ప్రత్యేక హోదాపై కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు నాటకాలాడుతున్నాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు పేర్కొన్నారు. గురువారం అరండల్‌పేటలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు ప్రధాన కారకులైన వైఎస్‌ఆర్, కాంగ్రెస్ పార్టీలు అబద్దాలాడుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నాయని, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరన్నారు. రాష్ట్రం సర్వనాశనం కావడానికి ప్రధాన భూమిక వహించింది ఈ రెండు పార్టీలేనన్నారు. ప్రత్యేకహోదా ఇచ్చేది కేంద్రమైతే, తెచ్చేది మాత్రం తెలుగుదేశం పార్టీ మాత్రమేనని, హోదా సాధించగలిగే సత్తా ఒక్క చంద్రబాబునాయుడుకే ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన శవం లాంటిదని, ఎన్ని నాటకాలాడినా ప్రజలు విశ్వసించరన్నారు. ప్రత్యేక హోదాపై కెవిపి రామచంద్రరావు ప్రైవేటు బిల్లు పెట్టారని, ప్రైవేటు బిల్లులకు ప్రాధాన్యత ఉండదన్నారు. పార్లమెంటులో లైట్లు ఆర్పేసి, రాజ్యసభలో ప్రజాప్రతినిధుల గొంతునొక్కేసి రాష్ట్ర విభజన చేస్తుంటే ఆనాడు కెవిపి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బొత్స సత్యనారాయణ, రఘువీరారెడ్డి, జగన్మోహనరెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రత్యేకహోదాపై ఏనాడైనా ప్రధానిని కలిశారా అని ప్రశ్నించారు. బిజెపి పార్టీ కూడా విభజన బిల్లుకు సహకరించిందని, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రత్యేకహోదాకు కట్టుబడి ఉండాలన్నారు. ప్రత్యేకహోదా అంశంలో కేంద్రంపై దశలవారీగా ఒత్తిడి తెస్తామన్నారు. గుంటూరు మిర్చియార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ ప్రత్యేకహోదాపై జగన్‌కు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబునాయుడు అభివృద్ధి చేస్తుంటే ఏనాడైనా ప్రజల పక్షాన మంచి సూచనగానీ, సలహా గానీ ఇవ్వకుండా రాష్ట్ర అభివృద్ధికి అడ్డుకోవడమే ధ్యేయంగా పనిచేశారన్నారు.