గుంటూరు

ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 7: దేశవ్యాప్తంగా ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించాలంటే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సీట్ల ఆధారంగా కాకుండా ముఖ్యమంత్రులను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని ఎంపిక పద్ధతిలో పలు మార్పులు రావాల్సిన అవసరం ఉందని పలువురు మేథావులు అభిప్రాయపడ్డారు. ఆదివారం నగరంలోని మల్లయ్యలింగం భవన్‌లోఎన్నికల్లో ధన ప్రవాహం.. పర్యవసానాలు.. ప్రజాస్వామ్య భవిష్యత్ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సుకు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ప్రజాస్వామ్య నిర్మాణాన్ని రూపొందించడంలో కొన్ని లొసుగులు ఉన్నాయని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చిన తొలి, రెండు ఎన్నికల్లో ఫలితాలు బాగున్నప్పటికీ రానురాను ఎన్నికల్లో ధన ప్రవాహం పెచ్చరిల్లుతోందన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు పనులు చేయించుకునేందుకు వెళితే అధికారులు స్పందించక పోవడంతో తిరిగి రాజకీయ నాయకులను ఆశ్రయించి చేతులు తడపవలసిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీని కాపాడుకునేందుకు 15 నుంచి 3వేల కోట్ల వరకు ఖర్చుపెడుతున్నారని పార్టీలు ఫ్యాక్టరీ కర్మాగారాలుగా మారుతున్నాయన్నారు. కార్యకర్తలను పోషించేందుకే కొన్ని పార్టీలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్, గుజరాత్, కేరళ ఎన్నికల్లో ధన ప్రవాహం తక్కువగా ఉంటుందన్నారు. దేశంలో వామపక్ష పార్టీలు చేసిన ఆలోచనలు ఏ పార్టీలు చేయలేదని వారు ఎన్ని త్యాగాలు చేసినప్పటికీ సరైన ఫలితాలు దక్కలేదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం డబ్బులేనివారు ఎన్నికల్లో పోటీచేసేందుకు అనర్హులనే విధంగా పరిస్థితులు మారాయన్నారు. డబ్బులేకపోయినా పార్టీకోసం పనిచేస్తే గతంలో ఎమ్మెల్సీ, ఎంపీ (రాజ్యసభ) పదవులలో ప్రాధాన్యత ఇచ్చేవారని ఇప్పుడు అవి కూడా అమ్ముకునే దౌర్భాగ్య స్థితిలో పార్టీలు ఉన్నాయన్నారు. చివరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవులలో కూడా ధన ప్రలోభాలకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల మాట్లాడుతూ దేశంలో రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనకు తమ పార్టీ శ్రీకారం చుట్టిందన్నారు. ఎన్నికల్లో సంస్కరణలకు, సామాజిక, రాజకీయ ఉద్యమ రూపంలోకి తీసుకొచ్చేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రోగ్రెసివ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవ చేయాలనే ఉద్దేశ్యాన్ని నాయకులు విస్మరించారని, తాము ఖర్చుపెట్టిన డబ్బుకు ఎంత సంపాదించాలనే భావనతో అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథరెడ్డి, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, పత్రికా ప్రముఖులు రాఘవాచారి, లోక్‌సత్తా జిల్లా అధ్యక్షుడు రామ్‌ప్రసాద్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు టి.సేవకుమార్, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.