గుంటూరు

పుష్కర వివరాలతో వెబ్‌సైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 7: కృష్ణా పుష్కరాలకు సంబంధించి జిల్లాలోని పుష్కర ఘాట్లు, పుష్కరనగర్‌లు, ఆయా ప్రదేశాలకు చేరుకునే మార్గాలు తదితర వివరాలతో కూడిన కరదీపికను, వెబ్‌సైట్ ను రూపొందిస్తున్నట్లు కలెక్టర్ కాంతీలాల్ దండే తెలిపారు. ఆదివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో పుష్కర ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. గుంటూరు జిల్లా కృష్ణా పుష్కర కరదీపికను ముద్రించడంతో పాటు వెబ్‌సైట్‌ను కూడా రూపొందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వివరాలతో పాటు ఘాట్లు, పుష్కరనగర్‌ల వివరాలు, శాఖల వారీగా నిర్వహించే విధులు, సిబ్బంది వివరాలను వెంటనే కలెక్టరేట్‌లోని పుష్కరాల సెల్‌కు పంపాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కరదీపిక, వెబ్‌సైట్ జిల్లాకు వచ్చే పుష్కర భక్తులకు ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు. పుష్కర విధులు నిర్వహించే సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీచేసేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్ రూపొందించామన్నారు. డేటా అప్‌డేట్ చేసేందుకు పుష్కర సెల్‌లో డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించామని, ఆయాశాఖల అధికారులు తమ సిబ్బంది వివరాలను వెంటనే అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో మునిసిపల్ కమిషనర్ నాగలక్ష్మి, జెసి-2 ఎం.వెంకటేశ్వరరావు, డీఆర్వో కె.నాగబాబు, రెవిన్యూ డివిజనల్ అధికారులు పాల్గొన్నారు.