గుంటూరు

ఈ మొక్కల సం‘గతి’ ఇంతేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, ఆగస్టు 8: కోటి మొక్కలు నాటేందుకు వనమహోత్సవం పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని కిందిస్థాయిలో అమలు చేసే యంత్రాంగం కరువయింది. పట్టణంలో వేల మొక్కలు నాటుతున్నామంటూ గతనెల 29న అధికారులు మొక్కలు తెచ్చి స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణ ప్రాంగణంలో ఉంచారు. కొన్ని మొక్కలు నాటగా మిగిలిన వాటిని వదిలేశారు. పుష్కర పనుల్లో తీరిక లేకుండా ఉన్నందున మొక్కలు నాటే పనులు చేయట్టలేక పోయామని అధికారులు చెబుతున్నారు. ప్రాంగణంలో పడి ఉన్న మొక్కలను ఆవులు తిని కొన్నింటిని పాడుచేశాయి. వేలసంఖ్యలో మొక్కలు నిరుపయోగంగా పడి ఎండకు ఎండుతున్నాయి. భవిష్యత్తులో నాటేందుకైనా కనీసం వాటికి నీళ్లుపోసే నాథుడులేక ఎండకు ఎండి పనికి రాకుండా పోతున్నాయి. రోజులో ఒక గంటసేపు మొక్కలు నాటేందుకు కేటాయిస్తే వీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రజాప్రతినిధులు, అధికార పార్టీనేతలైనా హరితాంధ్రప్రేదేశ్ సాధనకు నడుంబిగించి చెల్లా చెదురుగా పడి ఉన్న ఈ మొక్కలను పట్టణంలోని ఖాళీ ప్రదేశంలో నాటేందుకు సిద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.