గుంటూరు

పుష్కర విధులు అంకితభావంతో నిర్వర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, ఆగస్టు 9: ఈనెల 12 నుంచి 23 వరకు జరుగనున్న కృష్ణా పుష్కరాల సందర్భంగా వివిధ ప్రాంతాలనుంచి పట్టణానికి రాకపోకలు సాగించే పుష్కర యాత్రికులకు వసతి సౌకర్యాలు, అతిధి మర్యాదలు చేయడంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని , తద్వారా పురపాలక సంఘం ప్రతిష్ట పెంచాలని మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో కృష్ణా పుష్కరాల పోస్టర్లను కమిషనర్ టీవీ రంగారావులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం చైర్మన్ చిరంజీవి మాట్లాడుతూ మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో యాత్రికులు తరలివచ్చే అవకాశం ఉన్నందున మంచినీటి సమస్య లేకుండా చూడాలని, వివిధ సంస్థలు భోజన, పలహార ఏర్పాట్లు చూస్తున్నాయని, పట్టణంలో పారిశుద్ధ్య సమస్య లేకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపాల్టీపై ఉందని చైర్మన్ చిరంజీవి అన్నారు. కమిషనర్ టీవీ రంగారావు, డీఈ నూతలపాటి బ్రహ్మానందం, ఏఈలు శివాజీ, ఏడుకొండలు, మేనేజర్లు విజయలక్ష్మి, మున్సిపల్ అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.