గుంటూరు

పుష్కర యాత్రికులకు అసౌకర్యం లేకుండా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కార్పొరేషన్), ఆగస్టు 9: కృష్ణా పుష్కరాలకు రానున్న యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం కౌన్సిల్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన సమావేశంలో పుష్కరనగర్‌లో ఏర్పాటుచేసిన సౌకర్యాలు, ఉద్యోగుల విధుల గురించి తెలియజేశారు. పుష్కరనగర్‌లో మొత్తం 24 స్టాల్స్‌ను ఏర్పాటు చేశామని, ఇందులో పూజాసామగ్రి, హ్యాండ్‌లూమ్స్, సెల్ రీఛార్జ్, పండ్లు, మెడికల్‌షాపు, కూల్‌డ్రింక్స్ షాపులు, స్వయం సహాయక బృందాలు తయారుచేసిన వస్తువుల విక్రయాలు జరుగుతాయన్నారు. యాత్రికులకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో ఉచిత అల్పాహారం, భోజన వసతి కల్పించడంతో పాటు మరికొన్ని ఫుడ్‌కోర్ట్‌లను అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. రోజుకు సుమారుగా 10 నుంచి 12 వేల మంది యాత్రికులు రావచ్చని తదునుగుణంగా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. 5 వేల కుర్చీలు, 2 వేల మంది పడుకోవడానికి కార్పెట్, 75 టాయిలెట్స్, 40 బాత్‌రూమ్స్, 10 పడకలతో హాస్పిటల్, అంబులెన్సును ఏర్పాటుచేసినట్లు తెలియజేశారు. ఆర్వోప్లాంట్ల ద్వారా స్వచ్ఛమైన నీటిని అందించేందుకు 50 పాయింట్లను ఏర్పాటుచేశామని తెలియజేశారు. అలాగే పుష్కర విధులు నిర్వహించే నగరపాలక సంస్థ ఉద్యోగులు, సిబ్బంది అంకితభావంతో సేవలందించాలని ఆమె కోరారు.