గుంటూరు

సిరులిచ్చే శ్రీవరలక్ష్మీదేవికి మహిళల మంగళ నీరాజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), ఆగస్టు 12: సిరులు, సంపదలు, సౌభాగ్యాలు, వీటన్నింటికి తోడు సంతాన సాఫల్యాన్ని, దాంపత్య సుఖాన్ని అనుగ్రహించే శ్రీవరలక్ష్మీదేవికి శ్రావణ శుక్రవారం సందర్భంగా వేలాది మంది మహిళలు నగరంలో వివిధ ఆలయాల్లో మంగళ నీరాజనాలు అర్పించారు. ప్రభాత వేళ సూర్యభగవానుడికి తొలి నమస్కారం అర్పించి, మంగళ స్నానాలను ఆచరించి ఇళ్లలో పూజలు చేశారు. పసుపు, కుంకుమలు తోరణాలతో ఈ కలశాన్ని తీర్చిదిద్ది లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించారు. ముత్తయిదవులను తమ నివాసాలకు ఆహ్వానించి వాయినాలను ఇచ్చి వారి ఆశీస్సులు అందుకున్నారు. అరండల్‌పేటలోని శ్రీఅష్టలక్ష్మీ సమేత లక్ష్మీనారాయణ మందిరంలో అర్చకస్వామి మర్రిపాటి ప్రసాద్ నేతృత్వంలో సామూహికంగా జరిగిన వరలక్ష్మీ వ్రత మహోత్సవంలో 800 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. సంపత్‌నగర్‌లోని శ్రీశృంగేరీ శారదా పరమేశ్వరి దేవస్థానం, ఆర్ అగ్రహారంలోని శ్రీకన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, శ్యామలానగర్ శ్రీ గాయత్రి గణేష సంతోషిమాత ఆలయంలో శోభాయమానంగా, బృందావన్‌గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానం పద్మావతీ కళ్యాణ వేదికపై శ్రీ మహాలక్ష్మిని వరలక్ష్మీదేవిగా అలంకరించి ప్రత్యేక ఆసనంపై ఏర్పాటుచేసి వెయ్యి మంది మహిళల సమక్షంలో పూజలు నిర్వహించారు. నగరంలోని నలుమూలలా ఉన్న లక్ష్మీదేవి కొలువై ఉన్న దేవస్థానాల్లో వరలక్ష్మీవ్రతం ఉత్సవం కనులపండుగగా జరిగింది.