గుంటూరు

కనుల పండువగా కృష్ణమ్మకు నవహారతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 12: పంచారామక్షేత్రాల్లో ప్రథమక్షేత్రమైన అమరావతిలో ప్రవహిస్తున్న పవిత్ర కృష్ణవేణిమాతకు కృష్ణా పుష్కరాల సందర్భంగా శుక్రవారం సాయంత్రం నవహారతులను అందించారు. కృష్ణానది ఒడ్డున ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై అర్చకస్వాములు కృష్ణమ్మకు ఓంకార హారతి, నాగహారతి, సూర్యహారతి, చంద్రహారతి, నందిహారతి, సింహవారధి, కుంభహారతి, పంచహారతి, నక్షత్ర హారతులు సమర్పించారు. బాలచాముండికా అమరేశ్వర స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను అమరావతి పురవీధుల్లో ఊరేగించిన అనంతరం నవహారతులు పట్టారు. ఈ కార్యక్రమాన్ని దేవాదాయశాఖ డిసి సురేష్‌బాబు, అసిస్టెంట్ కమిషనర్ కెబి శ్రీనివాసరావు, ఆలయ అధికారి నల్లకాల్వ శ్రీనివాసరెడ్డితో పాటు సుమారు 2 వేల మందికి పైగా భక్తులు కృష్ణమ్మ హారతులను తిలకించి తరించారు.