గుంటూరు

నదీమ తల్లికి పూజలతో సిరిసంపదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతానగరం, ఆగస్టు 12: జీవకోటికి ప్రాణాధారమైన నీరు అందించే నదీమ తల్లికి పూజాది కార్యక్రమాలు నిర్వహించటం వలన ఆయుషు, సిరిసంపదలు లభిస్తాయని సీతానగరం వేదవిశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి పేర్కొన్నారు. శుక్రవారం సీతానగరంలోని ప్రధాన ఘాట్‌లో ఆయన ప్రతేక పూజలు నిర్వహించి, పవిత్ర పుష్కర స్నానమాచరించారు. వేదవిశ్వవిద్యాలయం నుండి జీయర్‌స్వామి శిష్యులు, భక్తులతో కలిసి, సుదర్శన పెరుమాళ్‌తో ఊరేగింపుగా ఘాట్‌కు చేరుకున్నారు. కపిల గోవుల జంటకు, అశ్వద్థ వృక్షానికి పూజలు చేశారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామి కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, పాలు, తేనె, గంధంలతో పూజలు నిర్వహించారు. కృష్ణమ్మకు నూతన వస్త్రాలు, పూలజడను సమర్పించారు. కృష్ణమ్మకు హారతినిచ్చి భక్తులతో సంకల్పం చేయించి నదీస్నానమాచరించారు. సూర్యభగవానునికి ఆర్ఘ్య ప్రదానం చేసి నదీమ తల్లికి, బృహస్పతికి నమస్కరిస్తూ సర్వదేవతలు అనుకూలంగా ఉండి ప్రజలందరికీ శుభాలు చేకూర్చాలని ఆయన ఆశీర్వచనాలు పలికారు. అనంతరం భక్తులనుద్దేశించి స్వామిజీ మాట్లాడుతూ కన్యారాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు కృష్ణాపుష్కరాల సమయం ఆసన్నమవుతుందని తెలిపారు. పుష్కరస్నానమాచరించే ప్రతి ఒక్కరూ సూర్యదర్శనం చేసుకుని నదీ స్నానం ఆచరించాలని సూచించారు. పుష్కరస్నానం అత్యంత శుభప్రదమని, శుభాలు కలుగుతాయని పేర్కొన్నారు. పుష్కరాలను బాధ్యతతో నిర్వహించటం హర్షించదగ్గ విషయమని, సృష్టిలో ఎవరి పని వారు నిర్వర్తించాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణమ్మ పరవళ్ళు సిరులకు చిహ్నమని, శుభాలు కలిగించి, మంచి పంటలు పండాలని ఆకాంక్షించారు. జీవకోటికి మంచి ప్రాణశక్తి అందాలని, ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. కృష్ణానదిని పవిత్రంగా ఉంచాలని, నదుల ద్వారానే నాగరికత విలసిల్లిందని అంటూ నదులను సంరక్షించుకోవాల్సిన భాద్యత అందరిపైన ఉందని చినజీయస్వామి పేర్కొన్నారు. స్వామిజీ వెంట పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు, గల్లా జయదేవ్, మంగళగిరి పురపాలకసంఘ చైర్మన్ గంజి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.