గుంటూరు

ప్రజల అభీష్టం మేరకే సుపరిపాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 16: ప్రజల అభీష్టం మేరకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా 5వ రోజైన మంగళవారం అమరావతిలోని ధరణికోట పుష్కరఘాట్‌ను ఆయన సందర్శించారు. పుష్కరాల కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన సౌకర్యాలపై భక్తులు, యాత్రికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఘాట్‌వద్ద ఏర్పాటుచేసిన పుష్కరిణీ మాత విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ నీరు ఎంతో అవసరమని, నదీమతల్లిని పూజించి ఆరాధించాలని, నదుల వల్ల మానవాళి జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తాయన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ కరవు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. వృథా అవుతున్న వర్షపునీటిని కాపాడుకుంటూ నిల్వచేస్తే భూగర్భ జలాలు పెరిగి తిరిగి మనకు నీరు పుష్కలంగా అందుతుందన్నారు. అనంతరం ధ్యానబుద్ధ ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన నమూనా ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన స్టాల్స్‌లో ఏర్పాటుచేసిన తినుబండారాలను పరిశీలించారు. తిరుమల తిరుపతి దేవస్థానం స్టాల్స్‌లోని తినుబండారాలను, యాగశాలను సందర్శించి పురోహితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. అమరావతి దేవాలయానికి సమీపంలోని వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు విగ్రహానికి వాసిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చంద్రబాబునాయుడు హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, పి నారాయణ, కామినేని శ్రీనివాస్, పరిటాల సునీత, ఎంపి గల్లా జయదేవ్, కలెక్టర్ కాంతిలాల్ దండే, జెడ్పీ ఛైర్‌పర్సన్ షేక్ జానీమూన్, ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ, ఎమ్మెల్యేలు జివి ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీ్ధర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.