గుంటూరు

నాయకత్వ లక్షణాలను కోల్పోతున్న జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 16: ప్రభుత్వంపై తిట్ల దండకాలు, శాపనార్దాలు పెడుతూ ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి నాయకత్వ లక్షణాలను కోల్పోతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు. మంగళవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలను 70 శాతంకు పైగా నెరవేర్చామని, కొన్ని హామీలు ఇవ్వక పోయినప్పటికీ అమలు చేసిన ఘనత టిడిపికే దక్కుతుందన్నారు. అమలాపురంలో దళితులపై జరిగిన దాడి సంఘటన దురదృష్టకరమని, సంఘటన జరిగిన వెంటనే బాధితులను ఆదుకునేందుకు సిఎం చంద్రబాబునాయుడు చర్యలు చేపట్టారన్నారు. దళితులకు ఏదో జరిగిపోతుందని జగన్ భూతద్దంలో చూపించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని, దీనిపై ఎలాంటి సందేహాలకు తావు లేదన్నారు. పుష్కర ఏర్పాట్లపై ప్రజలు సంతృప్తి వ్యక్తంచేస్తుంటే వైసిపి మాత్రం తప్పుడు ప్రచారాలకు దిగుతుందన్నారు. ప్రత్యేకహోదా కావాలంటున్న జగన్ ఒక్క పారిశ్రామికవర్గాలకే హోదా వలన రాయితీలు వస్తాయే తప్ప సా మాన్య ప్రజానీకానికి ఎలాంటి ప్రయోజనం చేకూరదన్నారు. తెలుగుదేశం ప్ర భుత్వం ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీ కూడా రాబట్టేందుకు కేంద్రంపై ఒ త్తిడి తెస్తుందన్నారు. రెండూ వస్తేనే రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. జగన్‌కు ఏనాడూ ప్రభుత్వంపై శుభ వచనాలు పలగకుండా అశుభమైన పదాలు వాడుతూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
శాకాహారంతోనే శారీరక దృఢత్వం
సీతానగరం, ఆగస్టు 16: మానవ జీవితానికి సాత్విక ఆహారం చాలా అవసరమని, శాకాహారం అమృత ఆహారం కాగా మాంసాహారం అసహజమైన ఆహారమని స్వామి వేదానంద సరస్వతి శిష్యులు పేర్కొన్నారు. మంగళవారం సీతానగరం ఘాట్‌లో పుష్కరస్నానాలు ఆచరించే ముందు ధ్యానం, యోగాసనాల గురించి భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా ఒక శిష్యుడు తన పూర్తి శరీర బరువును చేతులపై మోస్తూ చేసిన యోగాసనం పుష్కర భక్తులను ఆకట్టుకుంది. జంతుబలులు ఆపాలని, పసుపక్షాదులను కాపాడాలని కోరారు. సమస్త మానవాళి మానసిక ప్రశాంతతకు, ఆధ్యాత్మిక ఉన్నతికి ధాన్యం ఒక్కటే మార్గమని శిష్యులు తెలిపారు.