గుంటూరు

45 వేల మందికి పైగా పవిత్రస్నానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, ఆగస్టు 21: మండలంలో ఉన్న 9 పుష్కర ఘాట్లకు ఆదివారం భక్తులు వేలాదిగా తరలిరావడంతో జనప్రవాహంలా మారింది. సెలవుదినం కావడంతో అధిక సంఖ్యలో యాత్రికులు విచ్చేయగా పుష్కరఘాట్లు ఆనందపు పూదోటలుగా మారాయి. నందులరేవు, తాడువాయి, గింజుపల్లి, చింతపల్లి, చామర్రు, కస్తల రేవు తదితర పుష్కరఘాట్లకు సుమారు 45 వేల మందికి పైగా భక్తులు అశేషంగా తరలివచ్చారు. చింతపల్లిలో కృష్ణా పుష్కర మహత్యం తెలిపే పాటల సిడిని, విష్ణుపంచాయతన మహా దేవాలయంలో గజల్ గాయకుడు గజల్ శ్రీనివాసరావు ఆవిష్కరించారు. దేవాలయ నిర్మాణానికి సహకరించిన భక్తులను సత్కరించారు. ఈ ఘాట్‌లో పిసిసి ప్రధాన కార్యదర్శి పక్కాల సూరిబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి పుష్కరస్నానం ఆచరించారు. కస్తలలో రక్తపోటుతో కంకణాలపల్లికి చెందిన నలబోతు లక్ష్మీనారాయణ కుప్పకూలగా సిబ్బంది వైద్యసేవలు అందించారు.