గుంటూరు

వడ్డెరలను ఎస్టీల్లో చేర్చేవరకు ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), ఏప్రిల్ 10: అన్నిరంగాల్లో వెనుకబడిన వడ్డెరలను ఎస్టీల జాబితాలో చేర్చేవరకు ఆందోళన కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వడ్డెర యువజన సమైక్య సమ్మేళనం ఏకగ్రీవంగా డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ వడ్డెర యువజన సమైక్య సంఘ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక అరండల్‌పేటలోని వైన్‌డీలర్స్ అసోసియేషన్ కల్యాణ మండపంలో రాష్టస్థ్రాయి వడ్డెర యువజన సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దేవెళ్ల వెంకట్ మాట్లాడుతూ దశాబ్దాల తరబడి అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉపయోగపడుతుంది ఒక్క వడ్డెరజాతి మాత్రమేనని వ్యాఖ్యానించారు. వడ్డెరల ఒంటి సత్తువ మానవ సమాజం ఏపుగా పెరిగేందుకు ఎరువైందన్నారు. సకల జనులకు బలిమిగా, కలిమిగా నిలబడిందన్నారు. సమాజ సంక్షేమాన్ని అంతగా ఆకాంక్షించే వడ్డెరజాతి మాత్రం ఏళ్ల తరబడి వెనుకబడే ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇందుకు ప్రధానకారణంగా ఐకమత్యం లేకపోవడమేనని అభిప్రాయపడ్డారు. అనైక్యత వలనే అనాదిగా అన్ని రాజకీయ పార్టీలు తమను కేవలం ఓటుబ్యాంకుగానే వాడుకుంటూ వస్తున్నాయని, ఆవేదన వ్యక్తంచేశారు. ఈ బలహీనతను అధిగమించేందుకు యువజనులుగా తామంతా రాష్టస్థ్రాయిలో సంఘటితమైనట్లు వెల్లడించారు. రాజకీయాలు, ప్రాంతాలకు అతీతంగా ఉన్న వడ్డెర యువజనులను అందరినీ ఏకతాటిపైకి తెచ్చి తమ సంక్షేమం కోసం ఉద్యమించాలన్నదే లక్ష్యంగా ఆయన వివరించారు. అందులో భాగంగానే తొలుత వడ్డెరలను ఎస్టీల్లో చేర్చాలన్న న్యాయమైన డిమాండ్ సాధన కోసం త్వరలోనే పోరుబాట పట్టనున్నట్లు వెల్లడించారు. అంతిమంగా రాజ్యాధికారం కోసం సమరశంఖం పూరిస్తామని దేవెళ్ల వెంకట్ వెల్లడించారు. సమ్మేళనంలో తురకా రమేష్, చల్లా వెంకట్, ఎ రాజు, తురకా శ్రీకాంత్, వేముల సాయి, సిహెచ్ శ్రీను, సిహెచ్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.